Home /News /jobs /

THOSE WHO ARE PREPARING FOR AP EAMCET EXAM SHOULD STUDY ACCORDING TO THIS THIS PLAN KNOW HERE VB VSP

AP EAMCET Prepration Plan: ఎంసెట్ లో మంచి ర్యాంక్ సాధనే మీ లక్ష్యమా.. అయితే ఈ ప్రణాళిక మీ కోసమే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదల అయ్యాయి. ఇక తర్వాత ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ కోర్సుల్లో జాయిన్ కావాలనుకున్నవారంతా ఎంసెట్(Eamcet) కోసం ప్రిపేర్ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏటా నిర్వహించే పరీక్ష ఎంసెట్.

ఇంకా చదవండి ...
    (P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18) 

    రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్(Inter Results) విడుదల అయ్యాయి. ఇక తర్వాత ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ కోర్సుల్లో జాయిన్ కావాలనుకున్నవారంతా ఎంసెట్(Eamcet) కోసం ప్రిపేర్(Prepare) అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏటా నిర్వహించే పరీక్ష ఎంసెట్(Eamcet). రెండు తెలుగు రాష్ట్రాలలో జూలై(July) నెలలో జరగనున్న ఎంసెట్ ఎగ్జామ్ కోసం, మంచి మార్కులు సాధించడం కోసం విద్యార్ధులు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పటికే ఎంసెట్ కోసం ప్రిపరేషన్(Preparation), ఎలా రాయాలి? ఎలా మార్కులు తెచ్చుకోవాలి? ఏ కాలేజీలో చదవాలంటే .. ఎన్ని మార్కులు రావాలి వంటి అంశాలపై విద్యార్ధులు చాలా వర్కవుట్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రిపేర్ అవుతున్న విద్యార్ధుల కోసం .. ఎంసెట్ పరీక్షలో ఏఏ అంశాలు గమనించాలి, ఎలా చదవాలి? ఎగ్జామ్ ఎలా రాస్తే మంచి మార్కులు గెయిన్ చెయ్యగలం? ఈ స్టోరీ లో చూద్దాం..

    Agnipath Agniveers Salaries: అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల.. అగ్నివీరులకు వేతనం ఎంతో తెలుసా?


    ప్రతీ ఏటా ఇంజినీరింగ్‌ కోసం ఎంసెట్‌ పరీక్ష రాయడానికి లక్షల్లో విద్యార్థులు పోటీ పడుతుంటారు. ఓ వైపు ఇంజనీరింగ్ కాలేజీలు పెరుగుతున్నాయి. సీట్లు కూడా పెరుగుతున్నాయి. కానీ వాటి కున్న  పోటీ మాత్రం తగ్గడంలేదు. ఉన్నతమైన భవిష్యత్తుకు,  త్వరగా ఉద్యోగం సంపాదించడానికి ఇంజినీరింగ్ సీటు సాధించడం ముఖ్యం. అందుకే అటు తల్లిదండ్రుల్లోనూ, విద్యార్ధులలోనూ ఇంజినీరింగ్ అంటే ఆసక్తి ఎక్కువే. ఈ ఏడాది ఇంటర్ మార్కుల వెయిటేజీ లేని కారణంగా పూర్తి ఎంట్రన్స్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు నిర్ణయిస్తారు. కాబట్టి పూర్తిగా ఎగ్జామ్ మీద పూర్తి ద్ళష్టి పెట్టడం అవసరం. ఈ ఏడాది కూడా కోవిడ్ కారణంగా తగ్గించిన సిలబస్ నుండే ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. కాబట్టి ఎంసెట్ కు కూడా అదే సిలబస్ నుండి వచ్చిన టాపిక్స్ ను చదివితే సరిపోతుంది. సిలబస్ లో లేని సబ్జెక్స్స్, టాపిక్స్ ను వదిలి పెట్టేయాలి. ఇందులో ముఖ్యంగా ఇంజనీరింగ్ లో ఫిజిక్స్ , కెమిస్ట్రీ, మ్యాధమేటిక్స్ సబ్జెక్ట్ ల నుండి తగ్గించిన సిలబస్ ను చూసుకొని, అందులో ఏ చాప్టర్ నుండి, ఏ టాపిక్స్ వస్తున్నాయో చూసుకొని దాని ప్రకారం చదివితే.. ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది.

    సబ్జెక్ట్ ల వారీగా ముఖ్యమైన చాప్టర్లను పరిశీలిద్దాం.

    1)ఫిజిక్స్: ఇందులో మెకానిక్స్, ఫ్లూయిడ్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, వేవ్స్ అండ్ సౌండ్, కెపాసిటర్స్ & ఎలెక్ట్రోస్టాటిక్స్, మాగ్నెటిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆప్టిక్స్ అండ్ మోడరన్ ఫిజిక్స్ ప్రధానమైనవి.

    2)కెమిస్ట్రీ: క్వాలిటేటివ్ అనాలిసిస్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ & కెమికల్ బాండింగ్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం ఇన్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆల్డిహైడ్ & కీటోన్, ఆల్కైల్ & ఆర్గానిక్ కెమిస్ట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్ ప్రధాన చాప్టర్లు.

    3)మ్యాథమేటిక్స్: క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ & ఎక్స్‌ప్రెషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, ప్రాబబిలిటీ, వెక్టర్స్ & 3D జ్యామితి, బీజగణితంలో మాత్రికలు; కోఆర్డినేట్ జ్యామితిలో సర్కిల్, పారాబోలా, హైపర్బోలా; విధులు, పరిమితులు, కొనసాగింపు, భేదం, ఉత్పన్నాల అప్లికేషన్లు ప్రధాన చాప్టర్లు.

    ఎంసెట్ లో మంచి మార్కులు సాధించాలంటే ఏం చేయాలి
    ఎంసెట్ లో మంచి మార్కులు సాధించాంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ప్రాట్రన్ ను అనుసరించి ప్రిపరేషన్ విషయంలో, పరీక్ష రాసే విధానంలో ప్రతీ విద్యార్ధి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

    *ఎంసెట్‌ ఇంటర్ సిలబస్‌లోని టాపిక్స్ ఆధారంగానే ఉంటుంది. అందువల్ల అన్ని సబ్జెక్టుల్లోని కీలక అంశాలపై పట్టు సాధించాలి.

    *టాపిక్స్ కు సంబంధించి ఫార్ములాలతో కూడిన షార్ట్ నోట్స్‌లు ప్రిపేర్ చేయాలి. అవి రివిజన్‌లో ఎంతో ఉపకరిస్తాయి.

    *పూర్తిగా ప్రాక్టికల్‌గా ఉండే మ్యాథమెటిక్స్, బొమ్మలు, చార్ట్‌ల రూపంలో ప్రాక్టీస్ చేయడం ద్వారా.. ఎగ్జామ్ రాసే సమయంలో ఎంతో మేలు చేస్తుంది. దీంతో మంచి మార్కులు సాధించవచ్చు.

    *ప్రతీరోజూ మూడు సబ్జెక్టులను కవర్ చేసే విధంగా స్టడీ షెడ్యూల్‌ను సిద్ధం చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్‌ను, ఏ అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

    అన్నీ సబ్జెక్టులకు సమానంగా సమయాన్ని కేటాయించాలి. మొదట ధియరీ భాగాన్ని తర్వాత ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది.

    *ప్రిపరేషన్ టైం లోనే సబ్జెక్ట్ లోని అనుమానాలను నివ్ళత్తి చేసుకోవాలి. వేగం, ఖచ్చితత్వం పెరిగేలా మాక్ టెస్ట్ లు రాయడం , సమయ పాలన అవసరం

    *ఎంసెట్ పరీక్షా సరళిని అర్థం చేసుకోని, ఆపై మంచి పుస్తకాలను ఎంచుకోవడం, పర్ఫెక్ట్ అయ్యే వరకు మాక్ టెస్ట్‌లు, ఎంసెట్ ఓల్డ్‌ పేపర్లను ప్రాక్టీస్ చేయండి.

    *ఎంసెట్ లో పరీక్ష రాసే సమయంలో మంచి ప్రారంభం ఉండేలా చూసుకోవాలి. అందుకోసం మీకు అనుకూలమైన సబ్జెక్ట్ ను, బాగా పట్టు ఉన్న సబ్జెక్ట్ తో పరీక్ష ప్రారంభిండం అవసరం.

    *కష్టతరమైన ప్రశ్నల దగ్గర ,ఎక్కువ సమయం వ్ళధా చేయకుండా తర్వాత ఉన్న ప్రశ్నలు, సబ్జెక్ట్ ఎంచుకోవడం ఉత్తమం.

    *నెగెటివ్ మార్కులు లేని కారణంగా అన్నింటికీ సమాధానాలు రాయడం కంపల్సరీ అని గుర్తించాలి. వస్తే మార్కు వస్తుంది. లేకపోతే లేదు.

    *ఎంసెట్ ఆన్ లైన్ పరీక్షా విధానంలో ప్రశ్నలు స్క్రీన్ దాటి ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ప్రశ్నను గుర్తుంచుకొని సమాధానం రాయగలగాలి*పరీక్షలో కష్టమైన సబ్జెక్ట్ ప్రభావం మరొక సబ్జెక్ట పై పడకుండా చూసుకోవాలి

    *పరీక్షలో అన్ని ప్రశ్నలను క్షుణ్ణంగా చదువు కోవడం చాలా ముఖ్యం. ప్రశ్నలోనే సరైన/సరికాని వాక్యాలను గుర్తించి సమాధానాన్ని ఎంచుకోవాలి.

    *ముఖ్యంగా పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగా చేరుకుని, పరీక్షా కేంద్రంలో రిలాక్స్ అవండి. చివరి నిమిషంలో చేరుకున్నట్లయితే మీ మనసంతా గాబరా గాబరాగా తయారై పరీక్షమీద పూర్తి శ్రద్ధ పెట్టలేరు

    TS 10th Results Direct Link: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేస్తే 10 సెకన్లలో రిజల్ట్

    *వీలైనన్ని మాక్ టెస్టులు రాయడం వల్ల.. మీకు ప్రశ్నపత్రం నమూనా తెలియడమే కాక స్పీడ్ ప్రాక్టీస్‌కు కూడా అవకాశం కలుగుతుంది.

    *పరీక్షకు ముందు వారం రోజుల నుండి కొంచెం రిలాక్స్డ్డ్ గా ఉండటం ముఖ్యం. మీ తల్లిదండ్రులతో గడపడానికి ప్రయత్నించండి. ఇటువంటి పరీక్షలకు పాజిటివ్ ఎంకరేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్ అవసరం. అంటే మీ చుట్టూ మిమ్మల్ని ప్రోత్సహించే వారితో గడిపితే, మీరు ఎక్కువగా ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది.

    *మొదట ప్రశ్నపత్రం మొత్తం చదువుకుంటూ వెళ్లిపోండి. సులభమైన ప్రశ్నలకు సమాధానాలు వెంటనే రాయవచ్చు. ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియనపుడు దానికోసం అప్పుడు ఆగవద్దు. దానివలన సమయం వృధా అవుతుంది.

    ఇలా జాగ్రత్తగా చదువుకోవడం, ఎగ్జామ్ కు ప్రిపేర్ కావడం, ఎగ్జామ్ లో వచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయడం ద్వారా.. ఎంసెట్ లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. మంచి ఇంజనీరింగ్ కాలేజీలో ఇష్టమైన కోర్సును ఎంచుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.
    Published by:Veera Babu
    First published:

    Tags: Ap eamcet, Career and Courses, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు