Home /News /jobs /

THOSE WHO ARE PREPARING FOR AGNIVEER JOB SHOULD FOLLOW THE PREPARATION TIPS GIVEN HERE FOR THE EXAM VSP VB

Agniveer Jobs: అగ్నివీర్ కోసం ప్రిపేర్ అవుతున్నారా.. అయితే పరీక్ష విధానం.. ఎంపిక ప్రక్రియ వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశ రక్షణ శాఖలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో చేరి దేశ సేవలో పాలు పంచుకోవాలన్న యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్‌ స్కీమ్‌ (Agnipath Scheme) ను తీసుకువచ్చింది. అగ్నిపథ్‌లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీర్ అంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    (P. Anand Mohan, News 18, Visakhapatnam) 

    దేశ రక్షణ శాఖలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో చేరి దేశ సేవలో పాలు పంచుకోవాలన్న యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్‌ స్కీమ్‌ (Agnipath Scheme) ను తీసుకువచ్చింది. అగ్నిపథ్‌లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీర్ అంటారు. ఇందులో భాగంగా ఎయిర్‌ఫోర్స్‌(Indian Air Force), నేవీల్లో(Indian Navy) ఇప్పటికే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ మొదటి బ్యాచ్ రిక్రూట్‌మెంట్ కోసం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి రిక్రూట్ మెంట్ టెస్ట్ లు, ర్యాలీలు నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. ఇలా వివిధ విభాగాలలో రాత పరీక్షలు, ఫిజికల్, మెడికల్ రౌండ్ లలో సెలక్ట్ అయిన వారి నుండి షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను డిసెంబర్ 11, 2022న ప్రకటించి. అదే నెలలో మొదటి బ్యాచ్ ను శిక్షణ కోసం పిలుస్తారు.

    Postal Assistant Jobs: పోస్టల్ అసిస్టెంట్(PA/SA) నియామకాలపై కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ లో పలు మార్పులు..


    ఒకసారి IAFలో చేరిన తర్వాత, అగ్నివీర్స్ ఎయిర్ ఫోర్స్ యాక్ట్ 1950 ప్రకారం నాలుగేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ కు ఎలా సన్నద్దం కావాలి? ప్రిపరేషన్ టిప్స్ ఏంటి?  ఈ స్టోరీలో చూద్దాం ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ గా  అర్హత సాధించాలంటే మొత్తం 5 రకాల పరీక్షలు ఎదుర్కోవాలి. 1) ఆన్ లైన్ ఎగ్జామ్, 2)డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ రౌండ్, 3)ఫిజికల్ టెస్ట్ 4) అడాప్టబిలిటీ టెస్ట్ 5) మెడికల్ టెస్ట్ ఇలా ఐదు రకాల పరీక్షలు ఎదుర్కోవాలి. ఇలా ఐదు రకాల పరీక్షలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. చివరిగా డిసెంబర్ లో సెలక్షన్ లిస్ట్ ప్రకటించి మొదటి బ్యాచ్ ను సిద్దం చేస్తారు. కాగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ లో సెలక్ట్ అవడం కోసం మొదట వ్రాత పరీక్ష 25 జూలై, 2022న నిర్వహించారు. అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ కు మిగిలిన టెస్ట్ ల కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంది.



    ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ పరీక్షల్లో ఫేజ్ 1లో ఆన్‌లైన్ రిటన్ పరీక్ష ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ పరీక్షలు మూడు విభాగాలుగా జరుగుతాయి. 1)Science, 2)Other than Science, 3)Science and other than Science అనే మూడు గ్రూపులుగా జరుగుతాయి. పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో నిర్వహించారు. పరీక్షలో అడిగే ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఇవ్వబడుతుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కు ఉంటుంది. ఇలా ఫస్ట్ రౌండ్ లో ఆన్ లైన్ లో పరీక్ష పూర్తి చేసి క్వాలిఫై అయిన తర్వాత, రెండవ టెస్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్‌ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్ అభ్యర్ధులకు సంబంధించిన సర్టిఫికేట్స్, వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను వెరిఫై చేస్తారు.

    BIS Recruitment 2022: బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. BISలో పలు పోస్టుల భర్తీ.. జీతం రూ. 50వేలు..


    తర్వాత 3వ రౌండ్ గా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్(PFT) కు వెళ్లాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఫిజికల్ ఫిట్‌నెస్ ప్రమాణాలు చూస్తే..  1.6 కిమీ పరుగును కేవలం 6 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాలి. అనంతరం నిర్ణీత సమయంలో 10 పుష్-అప్‌లు, 10 సిట్-అప్‌లు, 20 స్క్వాట్‌లు చేయాల్సి ఉంటుంది. ఇలా ఫిజికల్ రౌండ్ కూడా పూర్తవుతుంది. ఇది క్వాలిఫై అయిన వారికి అడాప్టబిలిటీ టెస్ట్- I ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేయడం కోసం అభ్యర్థి సూటబిలిటీ ని అంచనా వేయడానికి నిర్వహిస్తారు. ఇది కూడా రాత పరీక్షే. ఆబ్జెక్టివ్ రకం ప్రశ్నలు ఉంటాయి. ఇది కూడా సెలక్ట్ అయిన వారికి అడాప్టబిలిటీ టెస్ట్- II ను నిర్వహిస్తారు. ఈ రెండు అడాప్టబిలిటీ టెస్టులు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్న వాతావారణాన్ని తనకు అనుకూలంగా అభ్యర్థి అడాప్ట్ చేసుకోగలడా? లేదా? సైనిక జీవన విధానానికి సర్దుబాటు చేసుకోగలడా లేదా, వైమానిక దళం వాతావరణానికి, అక్కడి పరిస్థితులను అర్ధం చేసుకొని పని చేయగలడా? లేదా? అన్నది పరీక్షిస్తారు.

    ఇందులో సెలక్ట్ అయినవారికి వైద్య పరీక్ష (Medical test)ను నిర్వహిస్తారు. ఇక్కడ మెడికల్ టెస్ట్ లో నిర్వహించబడే వివిధ వైద్య పరీక్షలు క్రింద వివరించబడ్డాయి. ఎయిర్ ఫోర్స్ లో పనిచేయాలంటే.. అభ్యర్థి మంచి శారీరక మరియు మానసిక ఆరోగ్యంతో ఉండాలి. ఏదైనా అనారోగ్యం లేదా వైకల్యం ఉండకూడదు. యుద్దంలేని సమయంలోనూ, యుద్ధ సమయంలోనూ, రకరకాల పరిస్థితులలో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించగలడా లేదా అన్నది మెడికల్ టెస్ట్ లలో తేలుతుంది.  అవసరమైన సమయంలో మెడికల్ ఆఫీసర్ అభిప్రాయం ప్రకారం ఇతర పరీక్షలు కూడా అవసరమైతే చేయిస్తారు. ఇవి కాక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేయడం కోసం ఇతర వైద్య ప్రమాణాలు ఉండాల్సి ఉంటుంది. కనీస ఎత్తు 152.5 సెం.మీ ఉండాలి. ఛాతీ కనిష్ట విస్తరణ పరిధి: 5 సెం.మీ ఉండాలి. బరువు వయస్సుకు, ఎత్తుకు తగ్గట్టుగా ఉండాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రమాణాల ప్రకారం వర్తించే దృశ్య అవసరాలు అంటే కంటి చూపుకు సంబంధించిన ప్రమాణాలు, డెంటల్ కు సంబంధించి ఆరోగ్యకరమైన చిగుళ్లు, మంచి దంతాలతో కనీసం 14 డెంటల్ పాయింట్లు ఉండాలి. వినికిడి ప్రమాణాలు ఉండాలి.

    ఇలా ఐదు రకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా ఐదు రకాల పరీక్షల ఫలితాలను డిసెంబర్ మొదటి వారంలో ప్రకటించి, షార్ట్‌లిస్ట్ లో ఎంపిక చేయబడిన అభ్యర్థులను ప్రకటిస్తారు. అనంతరం డిసెంబరు చివరి నాటికి మొదటి బ్యాచ్ నమోదును సిద్దం చేసి, డిసెంబర్ 30, 2022 నాటికి శిక్షణ ప్రారంభమవుతుంది. చివరిగా డిసెంబర్ లో సెలక్షన్ లిస్ట్ ప్రకటించి మొదటి బ్యాచ్ ను సిద్దం చేస్తారు. ఇలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ లను సెలక్ట్ చేసి శిక్షణ ఇచ్చి. వారిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి తీసుకుంటారు. సో.. అభ్యర్ధులందరికీ ఆల్ ది బెస్ట్.
    Published by:Veera Babu
    First published:

    Tags: Agniveer, Career and Courses, JOBS

    తదుపరి వార్తలు