రచయిత: మాధురి, బ్యాంకు పరీక్షల ర్యాంకర్, కౌటిల్య ఇనిస్టిట్యూట్, తిరుపతి
(సేకరణ: GT Hemanth Kumar, News18, Tirupati)
ఏ కాంపిటీటివ్ పరీక్ష(Competitive Exam) అయినా దానిలో ఆప్టిట్యూడ్ (Aptitude) అనేది ఉంటుంది. చాలామంది ఈ టాపిక్ అంటే భయపడుతుంటారు. అలాంటి భయాలు లేకుండా.. ఐబీపీఎస్ బ్యాంక్(IBPS Bank) పరీక్షల్లో ఎక్కువ మార్కులను దీని నుంచి ఎలా రాబట్టాలో తిరుపతిలోని(Tirupati) కౌటిల్య ఇనిస్టిట్యూట్ బ్యాంకు పరీక్ష ర్యాంకర్ మాధురి అభ్యర్థులకు కొన్ని సూచలను చేశారు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. మ్యాథమెటిక్స్(Mathematics) అంటేనే అందరూ భయపడుతూ ఉంటారు. క్యాలుకేషన్ పార్ట్ పై బాగా సాధన చేసి సాధన చేసి పట్టు సాధించాలి. మనం ముందుగా సాధన చేయాల్సింది సింప్లిఫికేషన్, క్వట్రాక్టిక్ ఈక్వేషన్స్, నెంబర్ సిరీస్. ఈ మూడు టాపిక్స్ నుంచి 15 నుంచి 20 వరకు మార్కులు వచ్చే అవకాశం ఉంది.
వీటి అనంతరం సింగిల్ ప్రశ్నల(మిస్ లేనియస్) పై శ్రద్ద పెట్టాలి. Ration And Proportion, పర్సెంటేజెస్., టైం అండ్ వర్క్(Time And Work), ట్రైన్స్ ప్రాబ్లమ్స్, పైప్స్ అండ్ సిస్టర్న్స్ పై పట్టు సాధిస్తే డేటా ఇంటర్ప్రిటేషన్స్ పూర్తి పూర్తి స్థాయిలో నేర్చుకున్నట్లే. రోజు మనం ఒక్క టాపిక్ విన్న తరువాత ఆ టాపిక్ పై పరీక్షా రాయాలి. తద్వారా మనం ఎక్కడ వెనుకబడి ఉన్నామో అర్థం అవుతుంది. బ్యాంకింగ్ పరీక్షల్లో టైం, అక్యురసీ కీ రోల్ ప్లే చేస్తాయి. క్యాలుకేషన్స్ వేగంగా చేయడం అనేది ముఖ్యం. దీనిలో మంచి ప్రావిణ్యం సాధిస్తే.. ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. పర్సెంటెజ్ అప్లికేషన్, ఆల్జీబ్రాలోని ఫార్ములాస్ మనకు అవగాహన ఉండాలి. పర్సెంటెజ్ అనే కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటే... సింప్లిఫికేషన్స్., పర్సెంటెజ్., ప్రాఫిట్ అండ్ లాస్., సింపుల్ ఇన్ ట్రస్ట్(SI)., కాంపౌండ్ ఇన్ ట్రస్ట్., డేటా ఇంటర్ప్రిటేషన్., డేటా అనాలసిస్ వంటి వాటిలో పర్సంటేజ్ ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది.
ఒక్క పర్సెంటెజ్ కాసెప్ట్ స్కోరింగ్ కు మంచి అవకాశం ఇస్తుంది. ఆల్జీబ్రా లో చిన్న చిన్న ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. అవసరమైతే ఫార్ములాస్ ను ఒకటికి రెండు సార్లు రోజూ ఓ పేపర్ పై ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రేషియో ప్రపోషన్, అలిగేషన్ మిక్చార్ రెండింటికి కాన్సెప్ట్ ఒక్కటే. ఇందులో ఒక టాపిక్ నేర్చుకుంట.. రెండో టాపిక్ కు అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అంతే కాకుండా.. వయస్సు ప్రాబ్లమ్స్ ఉంటాయి. . రేషియో ఒక్క టాపిక్ నేర్చుకోవడం ద్వారా.. ఇలా మిగిలిన మరో మూడు టాపిక్స్ ను సులభంగా చేయవచ్చు.
ఇక టైం సిరీస్ లో మరో మూడు టాపిక్స్ ఉంటాయి. టైం., ఎఫిసీఎంసీ., వర్క్ అనేవి టైం సిరీస్ లో భాగం. ఈ మూడు టాపిక్స్ నేమ్స్ మార్చుకుంటూ ప్రశ్నల రూపంలో మన ముందుకు వస్తాయి. పైన చెప్పిన మూడు కాన్సెప్ట్స్ ను మూడు బ్లాకులుగా డివైడ్ చేసి నేర్చుకుంటే మంచిది. మోడల్స్ ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మార్కులు రావు.. కేవలం ఆరిజిన్ టాపిక్స్ ని మంచిగా చదువుకుంటే చాలు. అంటే ఫార్ములాస్ లాంటికి ఎక్కువగా గుర్తు పెట్టుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IBPS, JOBS, Preparation