Home /News /jobs /

THOSE PREPARING FOR TELUGU PANDIT POSTS CAN GET THE JOB IF THEY FOLLOW THE BELOW MENTIONED BOOKS AND PREPARATION STRATEGY KNR VB

TRT Telugu Pandit Preparation Tips: టీఆర్టీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సూచన.. ఈ ప్రణాళికతో చదివితే ఉద్యోగం పక్కా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TRT తెలుగు ప‌డింత్  అనేది గతంలో ఉండేటువంటి పేరు..  ప్రస్తుతం లాంగ్వేజ్ పండిత్  పేరుతో పిలుస్తున్నారని.. జిల్లా ప్ర‌జ ప‌రిషత్ హైస్కూల్ దర్మారం (బీ) తెలుగు పండిత్ డాక్ట‌ర్ వారే ద‌స్తాగిరి సూచించారు. తెలుగు పండిట్ కొలువు సాధించడానికి అభ్యర్థులకు సూచనలు , సలహాలు ఇచ్చారు. వాటి గురించి ఇక్కడ తెలుకుందాం.

ఇంకా చదవండి ...
  (P. Srinivas, News 18, Karimnagar)

  TRT తెలుగు ప‌డింత్(TRT Telugu Pandit)  అనేది గతంలో ఉండేటువంటి పేరు..  ప్రస్తుతం లాంగ్వేజ్ పండిత్  పేరుతో పిలుస్తున్నారని.. జిల్లా ప్ర‌జ ప‌రిషత్ హైస్కూల్ దర్మారం (బీ) తెలుగు పండిత్ డాక్ట‌ర్ వారే ద‌స్తాగిరి సూచించారు. తెలుగు పండిట్ కొలువు సాధించడానికి అభ్యర్థులకు సూచనలు , సలహాలు ఇచ్చారు. వాటి గురించి ఇక్కడ తెలుకుందాం.  తెలుగు చదువుకున్నవాళ్ళు బిఏ తెలుగు..  MA తెలుగు..  బీఈడీ లో తెలుగు సెంక‌డ్ మెథడాలజీ(Methodology)  చ‌దివిన వారు.. తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసినటువంటి వాళ్లు.. లాంగ్వేజ్ పండిత్ పరీక్ష రాయడానికి  అర్హులు. త్వరలో గురుకుల డియేస్సీ ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో.. ఇప్పటికే అభ్యర్థులు పలు విధాలుగా ప్రిపరేషన్ అవుతున్నారు. టెట్లో పేపర్-2 క్వాలి ఫై  అయిన వాళ్ళు అందరూ కూడా లాంగ్వేజ్ పండిత్,  స్కూల్ అసిస్టెంట్  ఉద్యోగం చేయడానికి అర్హత సంపాదిస్తారు.. గతంలో 2012 సంవత్సరం కంటే ముందు సిలబస్ చాలా తక్కువగా ఉండేది..  కంటెంట్ కేవలం ప్రభుత్వ  పుస్తకాలు చదువుకుంటే  సరిపోయేది..

  Agniveer Preparation Tips: అగ్రివీరులుగా కొలువు సాధించాలంటే.. ఈ టాపిక్స్ పై ఎక్కువ దృష్టి పెట్టండి..


  2012 డీఎస్సీ నుండి సిలబస్ చాలా పెంచారు..  జాతీయ పరీక్ష  నెట్  తరహాలో లాంగ్వేజ్ పండట్ కి పెంచడం జరిగింది. అయితే  స్కూల్ అసిస్టెంట్ తో పోలిస్తే  లాంగ్వేజ్ పండట్ కి 30% సిలబస్ తక్కువగా ఉంటుంది.. మిగతా ఎనిమిది యూనిట్లు వారికి వీరికి సేమ్  ఉన్నప్పటికీ లాంగ్వేజ్ పండిట్ ప్రశ్నల కాఠిన్యతలో  కొంచెం పరిమాణం తక్కువగా ఉంటుంది..  లాంగ్వేజ్ పండిట్ సిలబస్ చాలా తక్కువ అంటే చదివిన పుస్తకాన్ని మళ్ళీ మళ్లీ చదివితే త్వరగా  ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది..ఇక  సిలబస్ విషయానికి  వస్తే 20 మార్కులు జనరల్ నాలెడ్జ్.. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ దానికి కేటాయిస్తే... తెలుగు కి మిగతా 60 మార్కులు  కేటాయిస్తారు...  60 మార్కుల్లో కంటెంట్ కి 44 మార్కులు... మెథడాలజీ కి 16 మార్కులు ఉంటాయి.. కంటెంట్ లో ఎనిమిది యూనిట్లు ఇచ్చారు.. ఈ ఎనిమిది యూనిట్లు గతంలో కేవలం పాఠ్యపుస్తకాల ఆధారంగా  ప్రశ్నలు  ఇచ్చేటటువంటి వారు.



  ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి కవుల. రచయిత ల గురించి సమగ్ర సమాచారం.. ప్రక్రియలకు సంబంధించిన సమగ్ర సమాచారం.. కవిత రీతులకు సంబంధించిన సమగ్ర సమాచారం.. తెలుగు పండిట్ ప్రిపరేషన్ ఐయ్యే వాళ్లకు ముఖ్యంగా రచయితలు,  కావ్యాలు,  రచనలు.. ప్రక్రియలు.. లక్షణాలు..  వివరణలు.. ఆధునిక సాహిత్యం ధోరణలు ఉద్యమాలు.. ఈ మొదటి మూడు యూనిట్లు సాహిత్య చరిత్రకు సంబంధించిన  పుస్తకాలు..చదవాలి .

  IBPS Reasoning Tips: బ్యాంక్ పరీక్షలో స్కోరింగ్ టాపిక్ ‘రీజనింగ్’.. తక్కువ సమయంలో ఎలా చేయాలో తెలుసుకోండి..


  ఎక్కువగా తెలుగు అకాడమీ బుక్స్ 5నుండి 10వ తరగతి వరకు చదివితే సరిపోతుంది. ఒకవేళ ఇన్ని పుస్తకాలు చదవలేను   టైం తక్కువగా ఉంది అని అనుకునేవారు ఏదయినా కోచింగ్ సెంటర్ మెటీరియల్స్ ఎంచుకొని చదివితే సరిపోతుంది.. మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా రెండు మూడు నెలల సమయం ఉంటుంది.. కాబట్టి ఒకటికి రెండు సార్లు రివిజన్డ్  చేసుకుంటే ఈజీగా ఉద్యోగం కొట్టేయ వచ్చు అంటున్నారు.. దస్తగిరి. ప్రణాళిక బద్దంగా, రోజుకు 10గంటలు మనవి కాదు అనుకుంటే.. ఎక్కువ మార్కులు చేసే అవకాశం ఉంటుంది. గత మాదిరి ప్రశ్నపత్రాలను ఎప్పటిక్కపుడు చూసుకుంటూ గత ప్రశ్నాపత్రాలు.. ఇప్పటికి తేడా ఏంటి అనే సరలిని చూస్తూ ముందుకు వెళ్ళాలి.  ఎన్ని కోచింగ్ లు ఎన్ని బుక్స్ చదివాము అన్నది ముఖ్యం కాదు సబ్జెక్టు అనేది మనకు మైండ్ లోకి ఎంతవరకు ఎన్నినది అనేది మనకు ముఖ్యం. ఇలా ప్రణాళికతో ముందుకు వెళ్తే కొలువు సాధించవచ్చు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Career and Courses, JOBS, Preparation, Teacher jobs, Telugu pandit

  తదుపరి వార్తలు