(P. Srinivas, News 18, Karimnagar)
ప్రస్తుతం తెలంగాణ లో గురుకుల పోస్టులకు(Telangana Gurukul Posts) ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ నోటిఫికేషన్(Notification) వెలువడే అవకాశం ఉంది. అంతే కాకుండా.. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎలా ప్రిపేర్ అవ్వాలి.. దానిలో ఎలా విజయం సాధించాలి.. ఉద్యోగం(Job) పొందాలంటే ఎలాంటి స్ట్రాటజీ ఫాలో(Strategy Follow) అవ్వాలి అనే విషయాలను కరీంనగర్ షైన్ తెలంగాణా ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ కరీం రాజు విద్యార్థులకు పలు సూచలను, సలహాలు ఇచ్చారు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
డియస్సీ లో స్కూల్స్ అసిస్టెంట్ కొలువు సాధించాలంటే ఈ కింద తెలిపిన పుస్తకాలను చదవాలని విద్యార్థులకు సూచించారు . ఇక స్కూల్ ఆసిస్టెంట్ , పండిత్ పోస్టులకు.. అలాగే SGT పోస్టులకు ఒకే సిలబస్ ఉంటుంది . పోటీ రీత్యా స్కూల్ అసిస్టెంట్ కు ఎక్కువ మంది పోటీ పడుతూ ఉంటారు. ఎక్కువగా కంటెంట్ కు 60మార్కులు ఉంటాయి . మిగతాది స్కూల్స్ మేనేజ్ మెంట్ కు 40మార్కులు ఉంటాయి. పర్స్ పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 15 మార్కులు ఉంటాయి. ఇండియన్ హిస్టరీకి 15, ఇండియన్ జాగ్రఫీకి 15మార్కులు, జనరల్ నాలెడ్జ్ కు 10 మార్కులు కేటాయించారు .
కంటెంట్ కి 60 మార్కులు .. మనము ఎక్కువగా 6తరగతి నుండి 12 తరగతి తెలుగు అకాడమీ బుక్స్ చదివితే సరిపోతుంది. వీటిని గనుక అధ్యయనం చేస్తే మొత్తం కవర్ అవుతుందన్నారు. గతంలో అంటే 2012 డీఎస్సీ కంటే ముందు ఉన్నటువంటి సెలబస్ కు ప్రస్తుత సిలబస్ కు చాలా తేడాలు ఉన్నాయి. ప్రస్తత సిలబస్ కఠినంగానూ.. అభ్యర్థులను ప్రతీ ఏరియాలో ప్రశ్నించే విధంగా ఉంటున్నాయి. కాబ్బటి మనము అందరిలో ముందు ఉండాలంటే ఎక్కువ కష్టపడాలన్నారు.
అవసరమైతే కోచింగ్ తీసుకోవాలన్నారు. కోచింగ్ తో పాటు.. సొంతంగా నోట్స్ కూడా రాసుకోవాలన్నారు. లైబ్రరీ, అలాగే డైలీ న్యూస్ పేపర్.. మార్కెట్ లో దొరికే మంచి పుస్తకాలు చదివితే స్కూల్స్ అసిస్టెంట్ పోస్ట్ మనదే అంటున్నారు. కోచింగ్ తీసుకుంటే జాబ్ కొట్టేయెచ్చు.. ఒక్కసారి కోచింగ్ తీసుకుంటే చాలు అనే ధోరణిలో చాలామంది ఉంటున్నారు. కానీ అలాంటి ఆలోచన తప్పు అంటున్నారు రాజు. కోచింగ్ తో పాటు.. దానికి తగ్గట్లు ప్రిపరేషన్ కూడా చేయాలన్నారు.
అప్పుడే ఎక్కువగా మార్కులు వస్తాయన్నారు.ఇలా చేస్తే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ప్రేపరషన్ ప్లాన్ అనేది తక్కువ సమయంలో ఎక్కువగా మార్కులు వచ్చేవిధంగా.. ప్రణాళిక బద్దంగా వెళ్తే సరిపోతుందంటున్నారు షైన్ తెలంగాణా ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ రాజు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, School assistant, Teacher, Teacher jobs