Home /News /jobs /

THOSE PREPARING FOR AP ICET WILL HAVE A CHANCE TO SCORE GOOD MARKS IF THEY PREPARE AS MENTIONED BELOW GNT VB

AP ICET Preparation Tips : ఐసెట్ ప్రిపరేషన్ టిప్స్.. నాన్ మ్యాథ్స్, మ్యాథ్స్ అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ICET).. సంక్షిప్తంగా ఐసెట్‌ . రాష్ట్రంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్ష. ముఖ్యంగా ఎంబీఏ పట్టాతో మేనేజ్‌మెంట్‌(Management) నిపుణులుగా రాణించాలనుకుంటున్న వారికి రాష్ట్ర స్థాయిలో ఎంతో కీలకమైన పరీక్ష ఐసెట్‌.

ఇంకా చదవండి ...
    (Anna Raghu, News18, Guntur)

    ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ICET).. సంక్షిప్తంగా ఐసెట్‌ . రాష్ట్రంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్ష. ముఖ్యంగా ఎంబీఏ పట్టాతో మేనేజ్‌మెంట్‌(Management) నిపుణులుగా రాణించాలనుకుంటున్న వారికి రాష్ట్ర స్థాయిలో ఎంతో కీలకమైన పరీక్ష ఐసెట్‌. అదే విధంగా ఎంసీఏతో సాఫ్ట్‌వేర్‌(Software) రంగంలో కొలువులు కోరుకునే వారికి కూడా ఐసెట్‌ ఉపయుక్త పరీక్ష. ఐసెట్ పరీక్షల్లో చాలా మంది చేసే తప్పులు కష్టంగా ఉండే ఆంశం పై ఎక్కువ సమయం కేటాయిస్తారు . అలా చేయడం వల్ల సమయంతోపాటు మార్కులు(Marks) కూడా సాధించలేరు. పరీక్షలో ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఆ తరువాత రీజనింగ్(Reasoning) సబ్జెక్ట్ లో తక్కువ సమయం లో ఎక్కువ మార్కులు చేయొచ్చు.

    AP ICET Preparation Tips: ఏపీ ఐసెట్ ప్రిపరేషన్ టిప్స్.. ఇలా చదివితే మంచి మార్కులు సాధించే అవకాశం..


    ఐసెట్ పోటీ పరీక్ష చాలా ఈజీ అయిన పరీక్షగా చెబుతున్నారు చాలామంది. ఔత్సాహిక విద్యార్ధులు కచ్చితమైన ప్రదర్శన చేస్తే.. రెండు వందల మార్కుల్లో దాదాపు 190 రావడం ఈజీయే. అయితే అది ఏ ఫార్మాట్ లో చదవాలి.. ఏ పాఠం నుంచి చదవాలి వంటివి చాలా ముఖ్యం. ఏపీఐసెట్ పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షలో మంచి ర్యాంకు సాధించాలి అంటే అర్ధమేటిక్స్ అండ్ రెజైనింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి.



    మేథమెటిక్స్‌లో బేసిక్స్ మరియు షాట్ కట్స్ విధానంపైన దృష్టిపెట్టి ప్రాక్టీస్‌ చేస్తే ఎగ్జామ్‌ హాల్‌ లో టైం సేవ్‌ ) అవుతుంది. సమయం ఎక్కువగా తీసుకునే కమ్యూనికేషన్ ఎబిలిటీ సబ్జెక్ట్ ను పరీక్షలో చివర్లో రాస్తే మంచిది. అయితే ప్రతి ప్రశ్నకు ఎంత సమయం ఇస్తామన్నదే ముఖ్యమంటున్నారు.

    SI Prelims Preparation: ఎస్ఐ ప్రిలిమ్స్ లో నెగెటివ్ మార్కులు ఉన్నా.. ఇలా ప్రపేర్ అయితే అర్హత సాధించొచ్చు..


    నాన్ మాథ్స్ స్టూడెంట్స్ ఫస్ట్ మాథ్స్ అంశం ను టచ్ చేయకపోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. మిగతా సబ్జెక్ట్ లకు సంబంధించిన వాటిని అటెమ్ట్ చేసిన తర్వాత చివరిలో మ్యాథ్స్ సబ్జెక్ట్ చేయాలి. మాథ్స్ స్టూడెంట్స్ అయితే ముందుగా మాథ్స్ ను స్టార్ట్ చేయడం వల్ల సమయం అవుతుంది. ఈ చిన్న టిప్స్ తెలుసుకోవడం వల్ల టైం తో పాటు మార్కులు పొందడం సులభం అవుతుంది. మరీ ముఖ్యంగా కంప్టేటివ్ ఎగ్జామ్స్ లో టైం మేనేజ్మెంట్ కీలకమైన అంశం . ప్రతి ఒక్కరి టైం మేనేజ్మెంట్ అలవర్చుకోవాలి . డేటా సైన్స్, ఇంగ్లీష్ గ్రామర్ , స్పెల్లింగ్ కరెక్షన్స్ , ఇంగ్లీష్ ప్యాసేజ్ , కంప్యూటర్ అర్థమేటిక్  వంటి అంశాలు పై ప్రతేక దృష్టి సారిస్తే పరీక్షల్లో సత్ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు ఐసెట్ బోధనా నిపుణులు శ్రీనివాస్.
    Published by:Veera Babu
    First published:

    Tags: Ap icet, Career and Courses, Icet preparation, JOBS, Preparation

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు