Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఉద్యోగులు హ్యాపీనా? సర్వేలో ఏం తేలిందంటే

Work From Home | వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగుందా? ఈ పద్ధతి ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందా? అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఉద్యోగులు ఏమనుకుంటున్నారా? ఓ సర్వేలో ఏం తేలిందో తెలుసుకోండి.

news18-telugu
Updated: September 24, 2020, 5:35 PM IST
Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఉద్యోగులు హ్యాపీనా? సర్వేలో ఏం తేలిందంటే
Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఉద్యోగులు హ్యాపీనా? సర్వేలో ఏం తేలిందంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని స్తంభింపజేసినప్పటి నుంచి ఆఫీసులు మూతబడ్డాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఆఫీసులు ఓపెన్ చేయొద్దని ప్రభుత్వాలు కూడా నియమ నిబంధనలు విధించాయి. దీంతో దాదాపు ఆరు నెలల నుంచి చాలామంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఇలా ఇంటి నుంచి ఉద్యోగాలు చేసేవారు ఎంత సంతృప్తితో పనిచేస్తున్నారనేది కంపెనీలు ఆలోచించట్లేదు. ఇలాంటి వారిలో చాలామంది ఆందోళన బారిన పడుతున్నారని, ఆఫీసులో పనిచేయడమే సౌకర్యంగా ఉన్నట్టు వారు భావిస్తున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ చేసిన సర్వేలో, కరోనా కారణంగా తమ కెరీర్ గ్రాఫ్ దెబ్బతిన్నట్లు దాదాపు 53% మంది నిపుణులు పేర్కొన్నారు. సెప్టెంబరు 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల పాటు ఈ సర్వే నిర్వహించారు. మొత్తం 1,625 మందిపై అధ్యయనం చేశారు. మీ కెరీర్‌పై వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రభావం ఎలా ఉంది, ఇంటి నుంచి పనిచేయడం, ఆఫీసులో పనిచేయడంలో తేడా ఏంటి.. వంటి ప్రశ్నలు అడిగారు.

Work From Hills: వర్క్ ఫ్రమ్ హిల్స్... టెకీ యువకుల నయా ట్రెండ్

JioPostpaid Plus: జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ

సమర్థంగా పనిచేయలేకపోయారు


వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభమైనప్పటి నుంచి తాము ఇంటర్నల్ నెట్వర్కింగ్ చేయలేకపోయామని దాదాపు 74% మంది చెప్పారు. కంపెనీ బయట నెట్వర్కింగ్ ప్రభావం చూపిందని దాదాపు 75% మంది చెప్పారు. దాదాపు 53% మంది తమ కెరీర్ గ్రాఫ్ పడిపోయినట్టు తెలిపారు. అంటే ఉద్యోగస్తులపై కరోనా ఎంతలా ప్రభావం చూపిందో తెలుసుకోవచ్చు. మహమ్మారి కారణంగా ఉద్యోగాలు చేసేవారిలో దాదాపు సగం మంది కెరీర్ గ్రాఫ్‌పై నెగెటివ్ ఇంప్యాక్ట్ పడింది.

ఇదే మంచిదంటున్న బిల్ గేట్స్


ఇంటి నుంచి పని చేయడం డ్రగ్స్క్‌కు అలవాటు పడినట్టుగా మారినా, చాలామంది నిపుణులు మాత్రం దీనితో సత్ఫలితాలు వస్తున్నట్టు భావిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్ ఇప్పటివరకు బాగా పనిచేసిందని, కరోనా తర్వాత కూడా చాలా కంపెనీలు ఈ పద్ధతినే కొనసాగించే అవకాశం ఉందని ఇటీవల బిల్ గేట్స్ పేర్కొనడం విశేషం. ఎకనామిక్ టైమ్స్ వార్తాసంస్థ నిర్వహించిన ఒక సదస్సులో మాట్లాడుతూ బిల్గేట్స్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహమ్మారి ముగిసిన తర్వాత ఎంత శాతం సమయం ఆఫీస్లో గడపాలో పునరాలోచించుకుంటామని గేట్స్ చెప్పారు. ఉద్యోగులు 50 శాతం కంటే తక్కువ సమయం ఆఫీస్‌లో గడపాలని చాలా సంస్థలు ఆశిస్తాయని, మిగతా కంపెనీలు సాధారణ మార్గంలోనే వెళ్తాయని ఆయన పేర్కొన్నారు.Realme Narzo 20 Series: రియల్‌మీ నార్జో 20 సిరీస్‌లో 3 స్మార్ట్‌ఫోన్స్... ఏది బెస్ట్ తెలుసుకోండి

CIBIL Score: లోన్ కావాలా? ముందు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి


వర్క్-లైఫ్ బ్యాలెన్‌ను వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్ దెబ్బతీసిందని చాలామంది నిపుణులు భావిస్తున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్టడీ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. ప్రపంచవ్యాప్తంగా 16 నగరాల్లో మూడు మిలియన్ల మంది ప్రజలపై నిర్వహించిన మరో అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. మహమ్మారి ప్రారంభమైన కొత్తలో ఇంటి నుంచి పని చేసినవారు, తమ వర్కింగ్ డే కు అదనంగా సగటున 8.2 శాతం లేదా 48.5 నిమిషాలు ఎక్కువగా పని చేసినట్టు తేలింది. గతంతో పోలిస్తే ఉద్యోగులు తక్కువ సమయంలో ఎక్కువ మీటింగ్లకు హాజరయ్యారని ఆ అధ్యయనం వెల్లడించింది.

ఆఫీస్ వర్కే బెటర్ అంటున్నారు


జూమ్ యాప్లో మీటింగ్లకు హాజరయ్యే ఉద్యోగులు, సమావేశం ఎంతసేపు కొనసాగినా ఆపమనలేరు, ఇంటరాక్ట్ కాకుండా ఉండలేరు అని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ రఫెల్లా సాడన్ చెబుతున్నారు. దీని వల్ల కూడా పని చేయాల్సిన సమయం పెరుగుతుందని ఆయన వివరిస్తున్నారు. మహమ్మారి వల్ల 9 టు 5 వర్కింగ్ డే స్థానంలో వీడియోకాన్ఫరెన్స్‌లు, చేయలేనంత పని వచ్చి పడ్డాయనేది నిజం. దీంతో చాలామంది ఉద్యోగులు ఎప్పుడెప్పుడు తమ కంపెనీలు ఓపెన్ చేస్తారా, ఆఫీస్లో పనికి ఎప్పటి నుంచి వెళ్దామా అని వేచి చూస్తున్నారు.
Published by: Santhosh Kumar S
First published: September 24, 2020, 5:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading