భారతదేశంలోని ప్రముఖ వైవిధ్య జాబ్ పోర్టల్ 'myAvtar' .. మహిళల(Women's) కోసం ఉచితంగా వర్చువల్ జాబ్ మేళా(Virtual Job Fair) మూడవ ఎడిషన్ ను(Third Edition) నిర్వహించనుంది. ఈ సంవత్సరం జూలై 02న ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 గంటల మధ్య ఈ ఇంటర్వ్యూలు(Interviews) ఉంటాయని ప్రకటించారు. ఈ ఫెయిర్(Fair) కెరీర్ దశల్లో పనిచేసే మహిళా నిపుణులకు, వారి కెరీర్ను పునఃప్రారంభించాలనుకునే వారికి కూడా అవకాశాలను అందిస్తుంది. సెక్టార్లలో మహిళలకు విస్తృత శ్రేణి రిక్రూట్మెంట్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి. myAvtar.com జాబ్ పోర్టల్ బ్యాంకింగ్, టెక్నాలజీ, ఫైనాన్స్, డిజిటల్ మార్కెటింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ వంటి విభిన్న డొమైన్లలో మహిళలకు అపారమైన అవకాశాలను అందిస్తుంది.
మహిళలు, LGBTQ కమ్యూనిటీ, వైకల్యాలున్న వ్యక్తులు, ఆర్మీ వెటరన్స్ మరియు మిలీనియల్స్ కోసం అవకాశాలను ప్రదర్శించడానికి డైవర్సిటీ, ఈక్విటీ & ఇన్క్లూజన్ (DEI) సొల్యూషన్స్ సంస్థ, అవతార్ గ్రూప్ 2020లో డైవర్సిటీ జాబ్ పోర్టల్ని ప్రారంభించింది.
దరఖాస్తు విధానం ఇలా..
స్టెప్ 1 : ముందుకు అధికారికి వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్టెప్ 2 : అక్కడ రిజిస్ట్రెషన్ నౌ (Registration Now) అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
స్టెప్ 3 : తర్వాత Candidate / Jobseeker Login అనే పేజిలో మీ వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
గత రెండు దశాబ్దాలుగా మహిళా ఉద్యోగుల భాగస్వామ్యాన్ని పెంచడంలో అవతార్ ముందుంది. మహిళల కోసం మైఅవతార్ జాబ్ ఫెయిర్ 3వ ఎడిషన్ను ప్రారంభిస్తున్నట్లు అవతార్ గ్రూప్ వ్యవస్థాపక - ప్రెసిడెంట్ డాక్టర్ సౌందర్య రాజేష్ వెల్లడించారు.
డాక్టర్ సౌందర్య రాజేష్ మాట్లాడుతూ.. “కోవిడ్ సంక్షోభం ఉద్యోగాలపై చూపిన తీవ్ర ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని గత రెండు జాబ్ మేళాలు నిర్వహించామన్నారు. ఈ ఫెయిర్లో అథర్ ఎనర్జీ, అమెజాన్, ఎమ్2పి ఫిన్టెక్, మాస్టర్ కార్డ్ ఇన్కార్పొరేటెడ్, సింక్రోనీ, టైటాన్ కంపెనీ, వెస్టాస్, ఆస్ట్రాజెనెకా, క్రిసిల్, బ్లూస్టార్ లిమిటెడ్, ఫోర్డ్ బిజినెస్ సొల్యూషన్స్ మరియు ఐసిఐసిఐ లాంబార్డ్ వంటి ప్రముఖ కంపెనీలు నిర్వహిస్తున్నాయి. దీనిలో వర్కింగ్ ఉమెన్ నుంచి మళ్లీ జాబ్ కోసం ప్రయత్నించే వారు కూడా ఈ జాబ్ ఫెయిర్ లో పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు https://www.myavtar.com/events/details/11 వెబ్ సైట్ లో చూడవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.