హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

high demand jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలకు మంచి డిమాండ్.. ఈ వివరాలు తప్పక తెలుసుకోండి

high demand jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలకు మంచి డిమాండ్.. ఈ వివరాలు తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెక్నాలజీ, కంప్యూటర్ ప్రోగ్రామ్‌లలో వచ్చిన మార్పులతో ఈ రోజుల్లో డేటాను సంగ్రహించడం, సేకరించడం, మేనేజ్ చేయడం, నిల్వ చేయడంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

డేటాబేస్ అంటే నిర్మాణాత్మక పద్ధతిలో సమాచారాన్ని (Information) నిల్వ చేయడం, మార్చడం, సేకరించడం అని అర్థం. అప్లికేషన్ పనిచేసినప్పుడల్లా, అది మనం ఫీడ్ చేసే సమాచారాన్ని నిల్వ చేస్తుంది లేదా దాని వద్ద ఉన్న సమాచారాన్ని తిరిగి షేర్ చేస్తుంది. ఆధునిక డిజిటల్ ప్రపంచంలో ప్రతి బిజినెస్.. దాని వినియోగదారులు, రోజువారీ వ్యాపార కార్యకలాపాల ద్వారా జనరేట్ అయ్యే డేటాపై ఆధారపడుతుంది. అందువల్ల డేటా ఉత్పత్తి (Generation), సేకరణ (Collection) ప్రతి వ్యాపార వ్యూహంలో (Business strategy) ముఖ్యమైన భాగంగా మారాయి. టెక్నాలజీ, కంప్యూటర్ ప్రోగ్రామ్‌లలో వచ్చిన మార్పులతో ఈ రోజుల్లో డేటాను సంగ్రహించడం, సేకరించడం, మేనేజ్ చేయడం, నిల్వ చేయడంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

ఇప్పుడు డేటాబేస్‌లు కేవలం అడ్డు వరుసలు, నిలువు వరుసలలో సమాచారాన్ని నిల్వ చేయడం లేదు.. వీడియోలు, ఫోటోలు, ఆడియో వంటి అన్ని రకాల ఇన్ఫర్మేషన్‌ను అధిక వేగంతో, భారీ పరిమాణంలో నిల్వ చేస్తున్నాయి. డేటా ఉత్పత్తి రంగంలో ఈ పురోగతితో డేటాబేస్ డెవలపర్‌ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఏదైనా సంస్థకు చెందిన ఇన్ఫర్మేషన్ స్టోరేజ్, డేటా మైనింగ్ కార్యకలాపాలకు వీరు గుండెగా మారారు.

ఏదైనా సంస్థ డేటా మేనేజ్‌మెంట్‌లో రెండు ప్రముఖ ఉద్యోగాలు ఉన్నాయి. అవే డేటాబేస్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్. కానీ కొన్నిసార్లు చిన్న బడ్జెట్‌, తక్కువ డేటాబేస్‌ ఉన్న సంస్థలు తరచుగా ఈ రోల్స్‌ను ఒకటిగా మిళితం చేస్తాయి. డేటాబేస్ డెవలపర్ ఉద్యోగుల విధులు తెలుసుకోవడంతో పాటు ఈ రంగంలో కెరీర్‌ ప్రారంభించేటప్పుడు అవసరమైన గైడెన్స్‌ను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.

డేటాబేస్ డెవలపర్ల కీలక బాధ్యతలు ఏంటి?

డేటాబేస్ డెవలపర్లను డేటాబేస్ డిజైనర్లు లేదా డేటాబేస్ ప్రోగ్రామర్లు అని కూడా అంటారు. రెగ్యులర్ ప్లాట్‌ఫారమ్ అప్‌డేట్స్ కోసం, మారుతున్న వినియోగదారుల అవసరాల కోసం కొత్త డేటాబేస్‌లను డిజైన్ చేయడం, క్రియేట్ చేయడం, ప్రోగ్రామింగ్ చేయడం, అమలు చేయడం, ఇప్పటికే ఉన్న వాటిని మాడిఫై చేయడం వంటివి డేటాబేస్ డెవలపర్స్ బాధ్యతలు. వారు సంస్థ లేదా క్లయింట్ కోసం బెస్ట్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌ను రన్ చేయడంతో పాటు డేటాబేస్ ప్రోగ్రామ్స్ సామర్థ్యం, పనితీరును పరీక్షించడం, సమస్యలు లేదా బగ్స్ ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించడం వంటి పనులు చేస్తారు.

టెక్నికల్‌గా డేటాబేస్ డెవలపర్ అంటే.. డేటాబేస్ టెక్నాలజీలను అనేక మార్గాల్లో సమన్వయం చేసుకునే ఒక IT ప్రొఫెషనల్. వీరు తమ సంస్థ డేటాబేస్ రేంజ్, ఫంక్షనాలిటీలను మెరుగుపరచడం, విస్తరించడంపై దృష్టి పెడతారు. వారి రోజువారీ విధులు, బాధ్యతల్లో ఏమేం ఉంటాయంటే..

- డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ డిజైనింగ్

- డేటాబేస్ డాక్యుమెంటేషన్‌ను క్రియేట్ చేయడం, అప్‌డేట్ చేయడం

- ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్లను విశ్లేషించడం, కొత్త ఫీచర్లను అభివృద్ధి చేయడం

- కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఉపయోగించి ప్రోగ్రామింగ్ కోడ్‌ రాయడం, మాడిఫై చేయడం

- లోపాలను సరిచేయడానికి ప్రోగ్రామ్ కోడ్స్ సవరణ, డాక్యుమెంటేషన్

- కోడ్స్‌లోని బగ్స్ గుర్తించడం, పరిష్కరించడం

- విశ్లేషణాత్మక, కఠినమైన పరీక్ష పద్ధతులను ఉపయోగించి సమస్యలను పరిష్కరించడం

- టెస్టింగ్ మాడ్యూల్స్, వ్యాలిడేషన్ ప్రాసెస్‌ అభివృద్ధి చేయడం

- అప్లికేషన్‌పై ప్రభావం చూపకుండా లైవ్ ఎన్విరాన్‌మెంట్‌లో కోడ్స్ అమలు చేయడం

వారి పనిలో టెక్నాలజీతో నిండిన మైండ్‌సెట్ ఉంటుంది. నిరంతరం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, ట్రెండ్స్ ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరం. కెరీర్‌లో ఎదగడానికి, ఫుల్ స్టాక్ డెవలపర్‌గా మారడానికి ఈ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి.

డేటాబేస్ డెవలపర్ కావడానికి అర్హతలు, అవసరమయ్యే నైపుణ్యాలు?

అధికారిక అర్హతలు ఉన్నవారు లేదా లేనివారు కూడా డేటాబేస్ డెవలపర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. సాధారణంగా కంప్యూటర్ సైన్స్ లేదా ఏదైనా ఇతర సంబంధిత రంగంలో సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులను కంపెనీలు నియమించుకుంటాయి. అయితే ఆ ఉద్యోగానికి మంచి టెక్నికల్ నాలెడ్జ్ తప్పనిసరి. అదనంగా ప్రొఫెషనల్, పర్సనల్, బిహేవియరల్ లక్షణాలు కూడా ఉండాలి. స్ట్రాంగ్ టీమ్ ప్లేయర్‌గా ఉండాలి. డేటాబేస్ పరిష్కారాలను రూపొందించడం, సిస్టమ్స్‌ను సొంతంగా పరీక్షించడం వంటి విషయాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలగాలి.

DB డెవలపర్ తెలుసుకోవాల్సిన ప్రాథమిక నైపుణ్యాలు

- SQL సర్వర్స్ & ఒరాకిల్ డేటాబేస్ నాలెడ్జ్

- SQL, T-SQL, PL/SQL నాలెడ్జ్

- డేటాబేస్ డిజైన్, డెవలప్‌మెంట్‌లో అనుభవం

-NoSQL వంటి నాన్-రిలేషనల్ డేటాబేస్‌ నాలెడ్జ్

- Windows, Linux వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై బేసిక్ నాలెడ్జ్

- సిస్టమ్ ఎనాలసిస్ చేయగల సామర్థ్యం

- C++, Java, C# వంటి వివిధ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ నాలెడ్జ్

- పైథాన్, జావాస్క్రిప్ట్, PHP వంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ నాలెడ్జ్

- వెబ్ సర్వర్స్, ఇంటర్‌ఫేసెస్, IT మేనేజ్‌మెంట్, IT టూల్స్ నాలెడ్జ్

- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, సిస్టమ్ ఇంటిగ్రేషన్, క్వాలిటీ టెస్టింగ్‌ ఎక్స్‌పీరియన్స్

- కొత్త డేటాబేస్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్‌పై అవగాహన

డేటాబేస్ డెవలపర్స్‌కు డిమాండ్‌ ఎందుకు ఎక్కువగా ఉంది?

IT, మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్ వంటి అన్ని రంగాలలో డేటాబేస్ డెవలపర్స్ కీలక పాత్ర పోషిస్తారు. ఈ సంస్థలు వృద్ధికి చాలా వ్యూహాత్మక విధానాన్ని అమలు చేస్తాయి. డేటా కలెక్షన్, జనరేషన్, ప్రాసెసింగ్‌పై ఆధారపడతాయి. ఈ డేటా ఫైల్స్ పెద్దవిగా ఉంటాయి. చాలా డేటాను కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని స్టోర్ చేయడం, మేనేజ్ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ డేటాను క్రమబద్ధంగా స్టోర్ చేసి, మేనేజ్ చేసేవే డేటాబేస్‌లు. డేటాబేస్ డెవలపర్లు ఈ డేటాబేస్‌ల వెనుక ఉండే మాస్టర్ మైండ్స్. ఈ ప్రక్రియలో డేటాబేస్ డెవలపర్లు తప్పనిసరిగా కంప్యూటర్ డేటాబేస్‌లను క్రియేట్ చేయాలి, మేనేజ్ చేయాలి, సమస్యలను పరిష్కరించాలి, పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్ చేయాలి.

డేటాబేస్ డెవలపర్ల జీతం, భవిష్యత్తు ఎలా ఉంటుంది?

దాదాపు అన్ని సంస్థలకు డేటాబేస్ డెవలపర్‌లు అవసరం. అయితే వీరి సంఖ్య, బాధ్యతలు సంస్థలను బట్టి మారవచ్చు. డేటాబేస్ డెవలపర్ జీతం.. సంస్థ పరిమాణం, పాత్ర, జవాబుదారీతనం, అభ్యర్థి సామర్థ్యం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. Glassdoor ప్రకారం, భారతదేశంలో డేటాబేస్ డెవలపర్‌ సగటు జీతం సంవత్సరానికి రూ.6 లక్షలు. బోనస్‌లు, కమీషన్‌లు వంటివి దీనికి అదనం. ఒక డేటాబేస్ డెవలపర్ కెరీర్‌లో మంచి స్థాయికి చేరుకొని, వేరే రోల్‌కి మారవచ్చు. డేటాబేస్ ఇంజనీర్ లేదా ఎనలిస్ట్ వంటి జాబ్ రోల్స్‌కు కూడా అప్లై చేసుకోవచ్చు. బిగ్ డేటాతో వ్యవహరించే ఇంజనీర్ల అవసరాలు పెరగడం వల్ల డేటాబేస్ డెవలపర్స్ జీతాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ప్రపంచం డిజిటల్ బాట పడుతూ, డేటా డ్రివెన్ వరల్డ్‌గా మారుతున్న నేపథ్యంలో, డేటాబేస్ డెవలపర్‌ల కెరీర్ చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. ఆన్‌లైన్ టూల్స్, ట్యుటోరియల్‌లు, లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ల సహాయంతో ఈ రంగంలో సెటిల్ కావచ్చు, కెరీర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. డేటాబేస్ డెవలపర్స్, సంబంధిత రంగాలకు సంబంధించిన ఉద్యోగాలు 2020- 2030 మధ్య 8-10%కి పెరుగుతాయని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (BLS) నివేదిక అంచనా వేసింది. అందువల్ల టెక్నాలజీ ఓరియెంటెడ్ మైండెడ్ వ్యక్తులకు ఇది మంచి కెరీర్ ఆప్షన్ అవుతుంది.

First published:

Tags: Information Technology, IT jobs, JOBS

ఉత్తమ కథలు