పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. వాటి దరఖాస్తుకు గడువుల మరో పదిహేను రోజుల్లో ముగుస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. వాటిల్లో ముఖ్యమైనవి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్(National Hydro Electric Power Corporation Pvt Ltd) లో సీనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, సీనియర్ అకౌంటెంట్ మరియు అసిస్టెంట్ రాజ్‌భాషా ఆఫీసర్ భర్తీకి విడుదలైన నోటిఫికేషన్. పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (Centre for Development of Advanced Computing )లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల నోటిఫికేషన్. వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(Western Coalfields Limited)లో 316 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి విడుదలైననోటిఫికేషన్.
ISRO Recruitment 2021: ఇస్రోలో జూనియర్ రీసర్చ్ ఫెలో పోస్టులు.. జీతం రూ.47,000
ఎన్‌హెచ్‌పీసీలో ఉద్యోగాలు..
దరఖాస్తుకు ఆఖరు తేదీ - సెప్టెంబర్ 30
(పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)
నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్(National Hydro Electric Power Corporation Pvt Ltd) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, సీనియర్ అకౌంటెంట్ మరియు అసిస్టెంట్ రాజ్‌భాషా ఆఫీసర్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు దేశంలో పలు ప్రాంతాల్లో ఉద్యోగం నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల అర్హతలు, అనుభవం ఆధారంగా వేతనం(Salary) రూ.1,80,000 ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు ఆఖరు తేదీ(Last Date) 30 సెప్టెంబర్ 2021 ఉంది.
సీడీఏసీలో 259 ఉద్యోగాలు..
దరఖాస్తుకు చివరి తేదీ - సెప్టెంబర్ 25
(పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)
పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (Centre for Development of Advanced Computing )లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 259 పోస్టులను భర్తీ చేయనుంది.
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 316 అప్రెంటీస్ ఖాళీలు
దరఖాస్తుకు చివరి తేదీ - సెప్టెంబర్ 21
(పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)
స్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(Western Coalfields Limited)లో 316 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ అప్రెంటీస్ కోసం ఎంపికైన వారు అప్రెంటీస్ చట్టం, 1961 ప్రకారం వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ ఒక సంవత్సరం పని చేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ (Graduates) అప్రెంటీస్‌కు ఎంపికైన వారికి రూ.9,000 స్టైఫండ్ చెల్లిస్తారు. డిప్లొమా అప్రెంటీస్(Apprentice) ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.8,000 స్టైఫండ్ (stipend) చెల్లిస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు అర్హతలు తెలసుకొందాం. ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ తప్పనిసరిగా MHRDNATS పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021