• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • THESE ARE THE DETAILS OF THE TOP SCHOLARSHIPS IN NEW ZEALAND FOR INTERNATIONAL STUDENTS NS GH

Study in New Zealand: న్యూజిలాండ్ లో చదవాలనుకుంటున్నారా? అయితే, ఈ స్కాలర్ షిప్ వివరాలు తెలుసుకోండి

Study in New Zealand: న్యూజిలాండ్ లో చదవాలనుకుంటున్నారా? అయితే, ఈ స్కాలర్ షిప్ వివరాలు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

న్యూజిలాండ్‌లో ఉన్నత విద్యకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ముఖ్యంగా భారత్ సహా అన్ని ఆసియా, పసిఫిక్ దేశాల్లోని విద్యార్థులు న్యూజిలాండ్ లో ఉన్నత విద్యకు ఆసక్తి చూపిస్తున్నారు.

  • Share this:
న్యూజిలాండ్‌లో ఉన్నత విద్యకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ముఖ్యంగా భారత్ సహా అన్ని ఆసియా, పసిఫిక్ దేశాల్లోని విద్యార్థులు న్యూజిలాండ్ లో ఉన్నత విద్యకు ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయిలో విద్య, అంతర్జాతీయ విద్యార్థులకు అందజేసే స్కాలర్ షిప్ లు మన విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. న్యూజిలాండ్ సంస్కృతి జీవవైవిధ్యం ప్రత్యేకమైనది. ప్రధానమంత్రి జసిండా ఆర్డర్న్ నాయత్వంలో అక్కడి విద్యాప్రమాణాలు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల విద్యార్థులను ఆకర్షించేలా అక్కడి విశ్వవిద్యాలయాలు ప్రత్యేక కోర్సులను అందిస్తున్నాయి. కరోనాతో ఆగిపోయిన విశ్వవిద్యాలయాలు ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రారంభమవుతున్నాయి. దీంతో అనేక యూనివర్సిటీలు అంతర్జాతీయ విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాయి. ప్రతిభ, నైపుణ్యం గల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి. న్యూజిలాండ్ లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న స్కాలర్ షిప్ లు, దరఖాస్తు తేదీలను పరిశీలించండి. మరింత సమాచారం కోసం ఆయా విశ్వవిద్యాలయాల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

న్యూజిలాండ్ స్కాలర్‌షిప్
అంతర్జాతీయ విద్యార్థులకు ప్రతి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య కోసం ఈ స్కాలర్ షిప్ అందిస్తారు. విదేశీ వ్యవహారాలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫార్సు చేయబడిన సబ్జెక్టుల్లో విద్యను అభ్యసించే, విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ లను పొందవచ్చు. అయితే, మీ దరఖాస్తులో, మీరు ఏ కోర్సు చేయదలచుకున్నారో, ఆ కోర్సు ఎంచుకోవడానికి కారణాలు, మీ నైపుణ్యాలు వంటివి వివరించాలి. అలాగే ఈ కోర్సులో మీరు నేర్చుకునే నైపుణ్యాలు మీ దేశ అభివృద్ధికి ఎలా ఉపయోగపడతాయో కూడా వివరించాలి.

ఆక్లాండ్ విశ్వవిద్యాలయం న్యూజిలాండ్ లోని అగ్రశ్రేణి విద్యా సంస్థలలో ఒకటి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ని పొందింది. ఈ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద 10,000 న్యూజిలాండ్ డాలర్ల స్కాలర్ షిప్ అందజేస్తుంది. ఈ స్కాలర్ షిప్ కి దరఖాస్తు చేయడానికి, మీరు తప్పనిసరిగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా మాస్టర్స్ ప్రోగ్రాంలో అడ్మిషన్ పొందిన అంతర్జాతీయ విద్యార్థి అయి ఉండాలి. మొత్తం 50 మందికి ఈ స్కాలర్ షిప్ అందజేస్తారు. ఏటా మార్చి, అక్టోబర్‌లలో దరఖాస్తులు స్వీకరించబడతాయి.

యూనివర్సిటీ ఆఫ్ వైకాటో ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ స్కాలర్‌షిప్
హామిల్టన్‌లోని ఈ విశ్వవిద్యాలయం యూజీ, పీజీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద NZ $ 10,000 స్కాలర్ షిప్ అందజేస్తుంది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన అంతర్జాతీయ విద్యార్థులందరూ ఈ స్కాలర్ షిప్ కి అర్హులే. అయితే, విద్యార్థి ప్రతిభ, నైపుణ్యం ఆధారంగా స్కాలర్ షిప్ కి ఎంపికచేస్తారు.

న్యూజిలాండ్ కామన్వెల్త్ స్కాలర్‌షిప్
న్యూజిలాండ్ తో సహా అన్ని కామన్వెల్త్ దేశాలు ఒకదానితో ఒకటి ప్రత్యేక సంబంధాలను కలిగి ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు జ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ స్కాలర్ షిప్ ని ప్రారంభించింది న్యూజిలాండ్ ప్రభుత్వం. దీన్ని ఆఫ్రికా, ఆసియా, అలాగే కరేబియన్, పసిఫిక్ ద్వీపాలకు చెందిన ప్రతిభ గల విద్యార్థుల కోసం ఇది రూపొందించారు. వారి గ్రాడ్యుయేషన్ తర్వాత వారి స్వదేశీ అభివృద్ధికి తోడ్పడాలనే ఉద్ధేశ్యంతో దీన్ని అందజేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్ డీ వంటి అన్ని కోర్సుల విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫుల్‌బ్రైట్ న్యూజిలాండ్ యుఎస్ గ్రాడ్యుయేట్ అవార్డ్
అమెరికన్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ స్కాలర్ షిప్ అందజేస్తున్నారు. దీని కింద ఫుల్‌బ్రైట్ ప్రతి సంవత్సరం ఎనిమిది అవార్డులను మంజూరు చేస్తుంది. వీటి విలువ NZ $ 35,000 వరకు ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published: