మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ (Technology)లో సైతం అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త టెక్నాలజీ (New Technologies)పై పట్టు సాధించిన వారికే ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరికి లక్షల్లో ప్యాకేజీలు (Packages) ఆఫర్ చేస్తూ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి టాప్ ఎంఎన్సీ కంపెనీలు (MNC Companies). అందుకే కొత్తగా డిమాండ్ ఉన్న కోర్సులను నేర్చుకుంటూ ఇతర కంపెనీలకు మారే వారి సంఖ్య బాగా పెరిగింది. తద్వారా ఐటీ రంగం (IT Industry)లో అట్రిషన్ రేట్ల గణనీయంగా పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఐటీ రంగాన్ని (IT Industry) శాసించనున్న టాప్ 5 కోర్సులను పరిశీలిద్దాం.
సైబర్ సెక్యూరిటీ
స్కిల్‌సాఫ్ట్ 2021 ఐటీ స్కిల్స్ (IT Skills), శాలరీ రిపోర్ట్ ప్రకారం, అన్ని ఐటీ కంపెనీలు సైబర్ సెక్యూరిటీ (Cyber security) ప్రాధాన్యతనిస్తున్నాయి. సంస్థల విలువైన డేటా (data)ను రక్షించడానికి, తమ క్లయింట్ల డేటాకు భద్రత (Security for Client data) కల్పించడానికి సైబర్ సెక్యూరిటీ (Cyber security)నిపుణుల అవసరం ఎంతో ఉంది. మరోవైపు, సైబర్ ఎటాక్‌లను నిరోధించడానికి మరింత మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులు అవసరం ఏర్పడుతోంది. అందుకే సైబర్ సెక్యూరిటీ నిపుణులకు అవకాశాలకు కొదవ లేదు.
క్లౌడ్ కంప్యూటింగ్
క్లౌడ్ కంప్యూటింగ్ డొమైన్ (Cloud computing Domain) 2017 నుండి నేటి వరకు వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్-ఫస్ట్ టెక్నాలజీ. ప్రపంచంలో అనేక సంస్థలు క్లౌడ్ కంప్యూటింగ్‌ను ఉపయోగిస్తున్నాయి. డెవోప్స్, సర్వర్‌లెస్ ఆర్కిటెక్చర్, ఆటోమేషన్ (Automation), క్యూఏ వంటి క్లౌడ్ కంప్యూటింగ్ (Cloud computing) నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా ఐటీ రంగంలో ఉన్నతమైన కెరీర్ అవకాశాలను పొందవచ్చు.
బిగ్ డేటా
సమాచార నిర్ణయాలను తీసుకోవడానికి డేటా (data)ను సేకరించడం, విశ్లేషించడం, దాన్ని సురక్షితంగా ఉపయోగించడం చాలా అవసరం. ఐటీ కంపెనీలకు డేటా నిర్వహణ సవాలుతో కూడుకున్నది. ప్రస్తుతం, మెజార్టీ కంపెనీలను బిగ్ డేటా అనలిస్టుల కొరత వేధిస్తోంది. అందువల్ల, బిగ్ డేటా అనలిస్ట్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (Artificial Intelligence and Machine Learning) మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. రోజువారీ కార్యకలాపాలను సులభతరం చేసేందుకు ఈ టెక్నాలజీ (Technology)ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతంలో నైపుణ్యం కలిగిన నిపుణులను పెద్ద మొత్తంలో ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ రిక్రూట్ చేసుకుంటున్నాయి కంపెనీలు.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
ఐటీ రంగంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IOT) నిపుణులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. 2015లో ఐవోటీ టెక్నాలజీతో కూడిన పరికరాలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే, 2021 చివరి నాటికి ఇవి మూడు రెట్లు పెరిగాయి. దీంతో, IoT ఇంజనీర్ల అవసరం కూడా పెరిగింది. అయితే, ఈ డొమైన్లో నిపుణుల (Domain Experts) కొరత వేధిస్తోంది. అందుకే, ఐవోటీ నిపుణులకు పెద్ద మొత్తంలో ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ వారిని రిక్రూట్ చేసుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cyber security, IT jobs, JOBS, New course