తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు(Assistant Professors/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్) - 2022 నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు (Application) ప్రక్రియ డిసెంబరు 30 నుంచి ప్రారంభమయ్యాయి. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు, ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్(Final Exam) రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే ఈ అర్హత పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ జనవరి 20న ముగియనుండగా.. దీనిని జనవరి 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరించారు. రూ. 1500 అపరాద రుసుముతో ఈ దరఖాస్తుల గడువు అనేది జనవరి 30వరకు ఉంది. అయితే.. ఇప్పటి వరు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే దానిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. వీటికి భారీ స్పందన నెలకొందని పేర్కొన్నారు. ఓయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షను రాసేందుకు దాదాపు 50వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. మూడేళ్ల తర్వాత విడుదలైన ఈ సెట్ పరీక్షకు వేలమంది దరఖాస్తు చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు, సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీ సమయంలో సెట్ ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. దీనిలో భాగంగానే పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు భారీగా ఈ పరీక్షకు దరఖాస్తులు సమర్పించారు.
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు పరీక్ష ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.2000, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్‌ఐ, ఓహెచ్, ట్రాన్స్‌జెండర్‌లు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 25 వరకు ఎలాంటి లేట్ ఫీ లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
జనవరి 25 నుంచి జనవరి 30, 2023 వరకు దరఖాస్తు చేసుకుంటే అభ్యర్థులు అపరాధ రుసుము రూ.1500.. జనవరి 31, 2023 నుంచి ఫిబ్రవరి 05 వరకు రూ.2వేలు, ఫిబ్రవరి 05 నుంచి ఫిబ్రవరి 10 వరకు అపరాధ రుసుము రూ.3వేలతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు సంబంధించి ఎడిట్ కు అవకాశం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో కల్పించనున్నారు.
పరీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ ఫిబ్రవరి చివరి వారంలో విడుదల కానున్నాయి. పరీక్షను మార్చి 13, 14, 15 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల కేటాయింపునకు సంబంధించిన వివరాలను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవాలి..?
కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ (ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్ఈ, ఐటీ) ఉత్తీర్ణులై ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 29 సబ్జెక్టులో పీజీ పూర్తి చేసిన వారు ఈ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్జెక్టుల వివరాలిలా ఉన్నాయి.
జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్ , ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ , ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana jobs, Ts set