హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Engineering Fees: ఇంజనీరింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ఆ 90 కళాశాలల్లో తగ్గనున్న ఫీజులు..! వివరాలివే

Engineering Fees: ఇంజనీరింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ఆ 90 కళాశాలల్లో తగ్గనున్న ఫీజులు..! వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఇంజనీరింగ్​ చదువుతున్న విద్యార్థులకు త్వరలో శుభవార్త అందే అవకాశం ఉంది. దాదాపు 90 కళాశాలల్లో ఫీజుల్లో మార్పు రానుంది. అంటే ఆ కాలేజీలు గతంలో నిర్ణయించిన ఫీజులు తగ్గనున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణలో ఇంజనీరింగ్ (Engineering) ​చదువుతున్న విద్యార్థులకు త్వరలో శుభవార్త అందే అవకాశం ఉంది. దాదాపు 90 కళాశాలల్లో ఫీజుల్లో మార్పు రానుంది. అంటే ఆ కాలేజీలు (Colleges) గతంలో నిర్ణయించిన ఫీజులు తగ్గనున్నాయి. ఇంజనీరింగ్‌ ఫీజుల (Engineering Fees) సవరణపై తెలంగాణ ఫీజ్‌, అడ్మిషన్స్‌ అండ్‌ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) చేపట్టిన కసరత్తు ముగిసింది. ఈ ఏడాది బీటెక్‌ కనిష్ఠ ఫీజు రూ.45 వేలు, గరిష్ఠ ఫీజు రూ.1.60 లక్షలుగా ఖరారు చేసింది. 10 నుంచి 12 కాలేజీల్లో ఫీజులు లక్షకుపైగా ఉన్నట్టు టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు వెల్లడించారు. గతేడాది బీటెక్‌ (B.Tech)కనిష్ఠ ఫీజు రూ.35వేలు, గరిష్ఠ ఫీజు రూ.1.34లక్షలుగా ఉంది. ఈ ఏడాది పలు కాలేజీల అకౌంట్లల్లో మిగులు మొత్తం (సర్‌ప్లస్‌), ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌, ప్లేస్‌మెంట్స్‌ కోసం యాజమాన్యాలు చూపించిన ఖర్చులను మినహాయించారు. దాంతో పలు కాలేజీల్లో 2019 -22 బ్లాక్‌ పీరియడ్‌కు ఖరారుచేసిన ఫీజుల కన్నా భారీగా తగ్గాయి. ఇలా 90కి పైగా కాలేజీల్లో ఫీజులు గతం కంటే తగ్గినట్టు అధికారులు తెలిపారు.

  తెలంగాణలో పలు కాలేజీలు తప్పుడు లెక్కలు చూపాయని, ఆడిటింగ్‌ లోపాల కారణంగా ఫీజుల్లో భారీ తేడాలున్నాయని అధికారులు వెల్లడించడం కలకలం రేపుతోంది. ఫీజుల ఖరారుకు టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు ఈ నెల 20, 21, 22న 90కి పైగా కాలేజీలను విచారణకు పిలిచి పరిశీలించారు. వీటిన్నింటిపై కూలంకషంగా ఓ నివేదికను రూపొందించారు. శనివారం నిర్వహించే టీఏఎఫ్‌ఆర్‌సీ కమిటీ సమావేశం ముందు ఆ నివేదికను ప్రవేశపెట్టనున్నారు.

  ఐఐటీ కంటే మెరుగైన కళాశాలలు ఏమున్నాయి?

  జేఈఈ మెయిన్స్ (JEE Mains) అత్యంత కష్టతరమైన , ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్(Engineering) ప్రవేశ పరీక్షగా పరిగణించబడుతుంది. JEE మెయిన్స్  భారతదేశంలోని ప్రసిద్ధ ఇంజనీరింగ్ కళాశాలలకు గేట్‌వేగా ఉపయోగపడుతుందని భావిస్తారు. చాలా తక్కువ మంది విద్యార్థులు (Students) పరీక్షలలో మంచి మార్కులు పొందడంలో విజయం సాధిస్తారు. ప్రశ్నలు చాలా కష్టంగా ఉండటంతో.. చాలా తక్కువ మందికి ఎక్కువ మార్కులు పొంది NIT లేదా IITలో ప్రవేశం పొందుతారు. అయితే జేఈఈలో మంచి ర్యాంక్ సాధించిన వారికి ఏ కాలేజీలో ప్రవేశం పొందాలో తెలియదు. వారి కోసం.. దేశంలో ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి ఐఐటి (IIT) కంటే మెరుగైన కళాశాలలు ఏమున్నాయో తెలుసుకుందాం..

  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), తిరుచిరాపల్లి

  ఈ ఇన్‌స్టిట్యూట్ భారతదేశంలోని ఇంజినీరింగ్ ఆశావాదులకు ప్రసిద్ధి చెందిన ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకటి అని చెప్పవచ్చు. ఇన్‌స్టిట్యూట్ అందించే 61 ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా JEE మెయిన్స్‌లో అర్హత పొందాలి.

  బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BITS)

  ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన ఇంజినీరింగ్ సంస్థ. వివిధ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికి JEE మెయిన్స్ స్కోర్‌ అనేది చాలా ముఖ్యం. దీనిలో సీటు సాధించాలంటే.. జేఈఈలో మంచి ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది. భారతదేశంలోని పురాతన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలలో ఒకటి.

  విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాగ్‌పూర్

  నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రసిద్ధ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలంటే, విద్యార్థులు JEE ప్రధాన ప్రవేశ పరీక్షలో 360 మార్కులకు 120 కంటే ఎక్కువ మార్కులు పొందాలి.

  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా

  ఫ్యాకల్టీ , ప్లేస్‌మెంట్ అవకాశాల పరంగా మెకానికల్ ఇంజనీరింగ్ ది అత్యుత్తమవైన కోర్సు . ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చేయాలంటే.. జేఈఈలో మంచి స్కోర్ సాధించాలి.

  కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పుణే

  ఇది 1854లో స్థాపించబడిన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ , మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు ఇక్కడ ఉత్తమ కోర్సులుగా పరిగణించబడతాయి. జేఈఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా దీనిలో సీటు సాధించవచ్చు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Colleges, Engineering, IIT

  ఉత్తమ కథలు