భారతీయ విద్యార్థులు(Students) విదేశాల్లో చదువుకోవడానికి ఎక్కువ ఆసక్తి కనబరిచే దేశం అమెరికా. అమెరికాలోనే ఉన్నత చదువులు చదువుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు. వాటిని సాకారం చేసుకోవడానికి వివిధ యూనివర్సిటీలు నిర్వహించే ఎంట్రెన్స్ టెస్టులు(Entrance Test) లాంటివి రాస్తుంటారు. వాటిలో అర్హత సాధిస్తేనే విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా.. అమెరికాలో ఉద్యోగం చేసుకోవాలంటే.. ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా అమెరికా భారతీయ విద్యార్థులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఉద్యోగానుమతి కోసం విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించేందుకు ప్రీమియం ప్రాసెసింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకునే సైన్స్, మేథ్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ (science, technology, engineering and mathematics - STEM) రంగాల విద్యార్థులకు ఎక్కువగా ఉపయోగపడనుంది.
ఇక.. I-765 ఫామ్ పెండింగ్ లో ఉన్న ఎఫ్ 1 స్టుడెంట్స్ కూడా ఇప్పుడు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ఐ 907 ఫామ్స్ ను USCIS కి పంపించవచ్చు. ఈ సౌలభ్యం మార్చి 06 నుంచే అన్ని కేటగిరీ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. ఇతర విద్యార్థులకు ఈ సదుపాయం ఏప్రిల్ 03 నుంచి ప్రీమియం ప్రాసెసింగ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు I-765 ఫామ్, I-907 ఫామ్ లను ఒకేసారి సబ్మిట్ చేయవచ్చు. ఈ మేరకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రీమియం ప్రాసెసింగ్ విధానం అంతర్జాతీయ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తమని యూఎస్‌సీఐఎస్ డైరెక్టర్ ఎమ్ జాడో పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ ఫిల్లింగ్ ఫెసిలిటీ USCIS వెబ్ సైట్లో అందుబాటులో ఉందని తెలిపారు. అర్హత కలిగిన అంతర్జాతీయ విద్యార్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. స్టెమ్ సహా వివిధ కేటగిరీల ఎఫ్ 1 వీసా (F-1) విద్యార్థుల ఓపీటీ పొడగింపు దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ కు అమెరికా తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇక ఇటువంటి విధానం భారతీయులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్నారై) అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Career and Courses, JOBS, Visa