(బాలకృష్ణ, న్యూస్ 18 ప్రతినిధి, హైదరాబాద్)
తెలంగాణలో( Telangana) ఇప్పటికే టెట్ పరీక్ష పూర్తయింది. ఇక డీఎస్సీ, గురకుల నోటఫికేషన్ (Notification) కోసం అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందులో ముఖ్యంగా బీఈడీ చేసిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే స్కూల్ అసిస్టెంట్(School Assistant) ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కింద తెలిపడిని ట్రిక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. వాటి గురించి తెలుసుకుందాం.. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ సిలబస్, పరీక్షా సరళి, కంటెంట్(Content) ఎలా ఉంటాయి ఏ విభాగాల్లో మనం మంచి మార్కులు సాధించే అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ల్లో మంచి మార్కులు సాధించాలంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పై మంచి పట్టు సాధించాలి. దాని కోసం క్రింది అంశాలపై ముఖ్యంగా అవగాహన ఉండాలి.
Aadhaar Update: ఇక ఆధార్ సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు... ఈ సేవలన్నీ ఆన్లైన్లోనే
1. హిస్టరీ: పూర్వ-వేద మరియు వేద కాలం, మధ్యయుగ విద్య, ఉడ్స్ డెస్పాచ్ (1854), హంటర్ కమిషన్ (1882), హార్టోగ్ కమిటీ (1929), సార్జెంట్ కమిటీ (1854), బ్రిటిష్ కాలంలోని వివిధ కమిటీల సిఫార్సులు ( 1944), ముదలియార్ కమిషన్ (1952-53), కొఠారీ కమిషన్ (1964-66), ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ (1977), NPE-1986, POA-1992 ప్రత్యేక సూచనలతో స్వతంత్ర అనంతర కాలంలో వివిధ కమిటీల సిఫార్సులు
2. ఉపాధ్యాయ సాధికారత: ఉపాధ్యాయుల కోసం వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి, ఉపాధ్యాయుల ప్రేరణ, ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంస్థల వృత్తిపరమైన అభివృద్ధి, ఉపాధ్యాయ విద్య కోసం జాతీయ / రాష్ట్ర స్థాయి సంస్థలు, పాఠశాలల్లో రికార్డులు మరియు రిజిస్టర్ల నిర్వహణ.
3. సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు: పర్యావరణ విద్య, పర్యావరణ విద్య యొక్క అర్థం మరియు పరిధి, స్థిరమైన అభివృద్ధి భావన, పర్యావరణ అభివృద్ధి, పాఠశాల అండ్ NGOల పాత్ర, ప్రజాస్వామ్యం, విద్య, సమానత్వం, సమానత్వం, విద్యలో నాణ్యత, సమానత్వం విద్యా అవకాశాలు, విద్య యొక్క ఆర్థిక శాస్త్రం, అర్థం మరియు పరిధి, మానవ మూలధనంగా విద్య, విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి వంటి అంశాలపై అవగాహాన చాలా ముఖ్యం.
అక్షరాస్యత – సాక్షర భారత్ మిషన్, జనాభా విద్య, జనాభా విద్య ప్రాముఖ్యత, భారతదేశంలో జనాభా పరిస్థితి, విధానాలు వాటి కార్యక్రమాలు, జనాభా విద్యకు సంబంధించిన విధానాలు పాఠశాల అండ్ ఉపాధ్యాయుల పాత్ర, జనాభా విద్య, కుటుంబ జీవిత విద్య, స్థిరమైన అభివృద్ధి, కౌమారదశ విద్య, ఆరోగ్యం విద్య, లింగం - సమానత్వం, సమానత్వం మరియు మహిళల సాధికారత, ఈ అంశాలపై అవగాహాన చాలా అవసరం.
పట్టణీకరణ మరియు వలసలు, జీవన నైపుణ్యాలు, సమ్మిళిత విద్య, సంభావిత స్పష్టీకరణ, నిర్వచనం, వ్యాప్తి, అపోహలు & వాస్తవాలు, లక్షణాలు, వర్గీకరణ & రకాలు, ముందస్తు గుర్తింపు,మూల్యాంకనం యొక్క ప్రాముఖ్యత, సమగ్ర విద్యను ప్లాన్ చేయడం, సమగ్ర విద్యలో తరగతి గది నిర్వహణ, మూల్యాంకనం. వంటి అంశాలను కూడా చూసుకోవడం మంచిదని చెబుతున్నారు అద్యాపకులు.
వర్గీకరణ & రకాలు, ముందస్తు గుర్తింపు మరియు మూల్యాంకనం ప్రాముఖ్యత, ప్రణాళికా సమ్మిళిత విద్య, సమగ్ర విద్యలో తరగతి గది నిర్వహణ, మూల్యాంకనం, డాక్యుమెంటేషన్ మరియు రికార్డు నిర్వహణ, మానసిక-సామాజిక నిర్వహణ, అవగాహన అండ్ సున్నితత్వ వ్యూహాలు, సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ వంటి అంశాలను కూడా ఒకసారి చూసుకుంటే మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Preparation