THE TELANGANA STATE GOVERNMENT DECIDED TO GIVE TRAINING ON CODING TO THE STUDENTS STUDYING IN THE PUBLIC SCHOOL VB
Government Schools: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు శుభవార్త .. వాటిలో శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం..
ప్రతీకాత్మక చిత్రం
Government Schools: తెలంగాణ విద్యాశాఖ, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్(ఎల్ఎల్ఎఫ్), డెల్ టెక్నాలజీస్ సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కోడింగ్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే విద్యార్థుల్లోని సృజనను వెలికితీసేందుకు వీలుగా 'స్టెమ్'(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) ఆధారిత ప్రయోగాలు చేపట్టేందుకు ప్రత్యేకంగా కిట్లు అందించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాల లో చదివే విద్యార్థు లకు తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది . ప్రభుత్వ పాఠశాల లో చదివే విద్యార్థుల కు కోడింగ్ పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్. రాష్ట్ర విద్యాశాఖ, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ మరియు డెల్ టెక్నాలజీస్ సంయుక్తంగా ప్రభుత్వ స్కుల్ళల్లో చదివే విద్యార్థులకు కోడింగ్ పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. సాంకేతిక యుగంలో కోడింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకే కాకుండా మరెన్నో ఇతర రంగాల్లో స్థిరపడాలనుకునే యువతకు కోడింగ్ తప్పనిసరి. ఎంతో మంది యువత ఉద్యోగసాధనలో భాగంగా నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతం కోడింగ్ నేర్చుకోనున్నారు. కోడింగ్ తో పాటుగా ఇతర ప్రయోగాలను చేసేందుకు గానూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న 50 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశాయి.
ఈ పాఠశాలల్లో దాదాపుగా 20 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ విద్యా శాఖ తాజా గా తీసుకున్న ఈ నిర్ణయం తో చాలా మంది విద్యార్థులకు లాభం చేకూరుతుంది. అంతే కాదు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య కూడా ఈ కొత్త పద్ధతి ద్వారా... పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పాఠశాలలను తిరిగి ప్రారంభించిన వివషయం తెలిసిందే. మొదట్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా నమోదైన అప్పటికీ.. ప్రస్తుతం హాజరు శాతం కూడా భారీగా నమోదవుతోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ పిల్లలను... పాఠశాలలకు పంపిస్తున్నారు తల్లిదండ్రులు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ కాస్త ధైర్యం చేసి ముందడుగు వేస్తున్నారు పిల్లల తల్లి దండ్రులు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోంది.
దాంతో ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పించేందుకు తల్లి తండ్రులు కూడా ఆసక్తి చూపుతున్నారు. దాంతో ప్రభుత్వ స్కుళ్లపై మరింత దృష్టి పెట్టింది తెలంగాణ సర్కారు. ఇక రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం తో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. స్కూళ్ళలో అడ్మిషన్ ల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. స్టెమ్ ఆధారిత ప్రయోగాలు చేపట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో వివిధ స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీల భాగస్వామ్యం తీసుకుంటుంది.
తాజాగా ఎల్ఎల్ఎఫ్, డెల్ సాయంతో రోబోటిక్స్, ఎల్ఈడీ, ట్రాన్సిస్టర్స్ నమూనాల తయారీకి విద్యార్థులతో ప్రయోగాలు చేయించనున్నారు. ప్రతివారం ఎల్ఎల్ఎఫ్ రిసోర్స్ పర్సన్ పాఠశాలను సందర్శించి కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. ఎంపిక చేసిన ప్రతి పాఠశాలకు ప్రయోగాలకు అవసరమైన కిట్లను ఆయా సంస్థలు అందించనున్నాయి. వాటి సాయంతో విద్యార్థులు నిత్య జీవితంలోనే కాక సమాజపరంగా ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలు కనుగొనేందుకు వినూత్న మార్గాల్లో ప్రయోగాలు చేస్తారు. దీనివల్ల విద్యార్థుల్లోనూ సృజనాత్మకత పెరుగుతుందని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.