కరోనా(Corona) మహమ్మారి కారణంగా 2020 నుంచి విద్యావ్యవస్థ అంతా చిన్నాబిన్నం అయిపోయింది. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. మరి కొంత మది కరోనా ప్రభావంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ కరోనా ప్రభావం అన్ని రంగాల్లో ఉన్నా.. విద్యారంగంలో ఎక్కువగా ఉందనే చెప్పాలి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పని చేసే ఉపాధ్యాయులు(Teachers) ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అంతే కాకుండా.. విద్యార్థులు కూడా ఆన్ లైన్ క్లాస్ లతో నానా పాట్లు పడ్డారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) పదో తరగతి విద్యార్థులకు నిర్వహించే పరీక్షల్లో మార్పులు చేసింది. గత రెండు సంవత్సరాల నుంచి కూడా మొత్తం 11 పేపర్లకు బదులు 6 పేపర్లుగా కుదించింది. ప్రత్యక్ష తరగతులు(Direct Classes) సాధ్యం కాకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
కానీ ఈ సారి అలాంటి పరిస్థితులు కనపిపిచడం లేదు. కరోనా వ్యప్తి కూడా అంతగా లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కంటే ముందు పదో తరగతి పరీక్షలకు ఎన్ని పేపర్లు అయితే ఉంటాయే.. అవే పేపర్లను ఈ సారి పరీక్షలకు ఉంటాయాని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Jobs in telangana, Students