THE TELANGANA BUDGET 2022 WILL BE INTRODUCED IN THE ASSEMBLY TOMORROW AND THIS TIME IT IS LIKELY TO ANNOUNCE UNEMPLOYMENT ALLOWANCE PRV
Telangana Budget 2022: రేపే తెలంగాణ బడ్జెట్.. ఈ సారి నిరుద్యోగ భృతి ప్రకటించే అవకాశం.. సంక్షేమానికే పెద్దపీట వేసే దిశలో సర్కారు!
తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రేపు ( మార్చి 7) ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. అదే రోజు రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెడతారు. అయితే తెలంగాణ సర్కారు నిరుద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం ఉంది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రేపు ( మార్చి 7) ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. అదే రోజు రాష్ట్ర బడ్జెట్ (Telangana Budget 2022)ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెడతారు. రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు నేడు సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గం సమావేశం అవనుంది. సభ ఎన్ని రోజులు జరగాలి అనే విషయంపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. కాగా, రాష్ట్ర ఆర్థిక శాఖ బడ్జెట్ (Telangana Budget 2022)ని రూ.2.60 లక్షల కోట్ల నుంచి రూ.2.70 లక్షల కోట్ల వరకు ఖరారు చేసి ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అనుగుణంగా ఈసారి బడ్జెట్లో సాగు, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో తెలంగాణ సర్కార్ రూ.2,30,825.96 కోట్ల బడ్జెట్ (Telangana Budget 2022)ను ప్రవేశపెట్టింది. ఇందులో ఈ జనవరి నాటికి రూ.1,37,190.44 కోట్లను వ్యయం చేసింది. కానీ, ఈ నెలాఖరుకు అన్ని రకాల వ్యయాల మొత్తం రూ.1.80 లక్షల కోట్లకు చేరుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం భారీ బడ్జెట్ (Telangana Budget 2022)పై కసరత్తు చేసింది. ఈ సారి నిరుద్యోగ భృతి (unemployment benefits)కి తప్పకుండా నిధులు కేటాయిస్తారని భావిస్తున్నారు. కనీసం 10 లక్షల మంది నిరుద్యోగులకు ఈ పథకం అమలు చేసినా దీనికోసం వేలాది కోట్ల వరకు కేటాయించాల్సి ఉంటుంది.
ఏడాదికి రూ.3,600 కోట్లు..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ.. తమ మేనిఫెస్టోలో.. నిరుద్యోగ భృతి (unemployment allowance) ఇస్తామని హామీ ఇచ్చింది. నిరుద్యోగ యువత ఉద్యోగం పొందే వరకూ నెలకు రూ.3,016 ఇస్తామని చెప్పింది. కానీ అది అమలు కాలేదు. దీనిపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆరేళ్లుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. తెలంగాణలో ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజుల్లో 10 లక్షల మంది నిరుద్యోగులుగా ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారు. అలాగే 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కింద అప్లై చేసుకున్నారు. వీరందరికీ భృతి ఇవ్వాలంటే రూ.1000 కోట్లు ఓ మూలకు రావనే వాదన ఉంది. ఉదాహరణకు 10 లక్షల మంది యువతకు నెలకు రూ.3,016 చొప్పున ఇవ్వాలన్నా.. ఏడాదికి రూ.3,600 కోట్లు అవసరం. అయితే వచ్చే బడ్జెట్లో అంతగా నిధులు ఉండకపోవచ్చు. దీంతో ఈసారి బడ్జెట్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే నోటిఫికేషన్లు రావడం లేదని అటు నిరుద్యోగులు, ఇటు ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. ఈసారి బడ్జెట్లో నిరుద్యోగులకు తీపి కబురు (unemployment allowance) రాలేదంటే అది టీఆర్ఎస్కు కష్టమే అయ్యే అవకాశం ఉంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.