హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP-TS Inter Advanced Results: రేపే తెలంగాణ, ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

AP-TS Inter Advanced Results: రేపే తెలంగాణ, ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

AP-TS Inter Advanced Results: రేపే తెలంగాణ, ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

AP-TS Inter Advanced Results: రేపే తెలంగాణ, ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

ఆగస్టు 01 నుంచి ఆగస్టు 10 వ తేదీ వరకు 10 రోజుల పాటు నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు రేపు (ఆగస్టు 30న) విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను రేపు ఉదయం 9.30 గంటలకు ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఆగస్టు 01 నుంచి ఆగస్టు 10 వ తేదీ వరకు 10 రోజుల పాటు నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ(Inter Advanced Supplementary Results) పరీక్షా ఫలితాలు రేపు (ఆగస్టు 30న) విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను రేపు ఉదయం 9.30 గంటలకు ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఎంసెట్ కౌన్సెలింగ్ ఉన్నందున కేవలం ద్వితీయ సంవత్సరం ఫలితాలను మాత్రమే విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు దాదాపు 1.13లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫ‌లితాల కోసం అభ్యర్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. దీనిలో అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి ఫలితాలను తెలుసుకోవచ్చు.


GATE 2023 Application Process: రేపటి నుంచి గేట్ 2023 దరఖాస్తులు.. ఏ పత్రాలు అవసరం.. దరఖాస్తు ఇలా..


ఇక ఈ సంవత్సరం నిర్వహించిన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఫిస్టియర్ లో 63.32 శాతం మరియు సెకండియర్ లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైన విషయం తెలిసిందే. మొత్తం 9,28,262 మంది పరీక్షలు రాయగా.. ఫస్టియర్‌లో 2,94,378 మంది, సెకండియర్‌లో 4,63,370 మంది ఉత్తీర్ణత సాధించారు.స్కోర్‌కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి..


1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. దీని కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి tsbie.cgg.gov.in.


2. సప్లిమెంటరీ పరీక్ష ఫలితం 2022 లింక్‌పై క్లిక్ చేయండి.


3. లాగ్-ఇన్ ఆధారాలను నమోదు చేయండి. అంటే రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్ అండ్ పుట్టిన తేదీ వివరాలను ఇవ్వాలి.


4. తర్వాత TS ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది


5. స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని.. తదుపరి అవసరాల కొరికు ప్రింట్ అవుట్ తీసుకోండి.


తెలంగాణతో పాటు.. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫిలితాలు కూడా రేపు విడుదల కానున్నాయి. ఏపీ ఇంటర్ ఫలితాలపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఒక వేళ రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు కూడా విడుదల అయితే.. ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ bie.ap.gov.in లో పొందవచ్చు. ఆగస్ట్ 3 నుంచి 2022 ఆగస్ట్ 12 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరిగిన విషయం తెలిసిందే. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్స్‌లో జరిగాయి.


Singareni Junior Assistant Update: 3 వేల మందికి పైగా హాల్ టికెట్స్ నిలిపివేత.. కారణం ఏంటంటే..


వారం రోజుల పాటు.. ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇవి ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని విద్యాశాఖ ఎడ్యు ఫెస్ట్ నిర్వహిస్తోంది. ఇక ఈ సంవత్సరం గోదావరి ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది అభ్యర్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయలేకపోయారు. వారి కోసం ఇంటర్మీడియట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష రాయలేక పోయిన వారిని పాస్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, TS Inter Results 2022

ఉత్తమ కథలు