Home /News /jobs /

THE STATE POLICE RECRUITMENT BOARD WILL CONDUCT A SINGLE PHYSICAL TEST FOR THE APPLICATIONS MADE SEPARATELY BY THE CANDIDATES FOR THE POSTS OF SI AND CONSTABLE VB

Telangana Police Jobs: తెలంగాణ పోలీస్ జాబ్స్ అభ్యర్థులకు అలర్ట్.. కీలక ప్రకటన చేసిన రిక్రూట్మెంట్ బోర్డ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Police Jobs: తెలంగాణ పోలీస్ జాబ్స్ కు దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో పోలీస్ జాబ్స్ కు(Telangana Police Jobs) సంబంధించిన ఇటీవల నోటిఫికేషన్లు(Notifications) విడుదలైన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. పోలీస్‌(Police), జైళ్ల శాఖ, ఫైర్‌, ఎక్సైజ్‌, రవాణా శాఖల్లో కలిపి మొత్తం 17,291 ఖాళీలకు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(Telangana Police Recruitment Board) దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే మొత్తం మూడు దశల్లో ఈ ఎంపిక ప్రక్రియ సాగనుంది. ఇందులో మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ టెస్ట్ లు ఉంటాయి. అనంతరం తుది రాత పరీక్ష ఉంటుంది. అయితే ఆగస్టు 7వ తేదీన ఎస్ఐ(Sub Inspector) జాబ్స్ కు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్(Preliminary Exam), రెండు వారాల తేడాతో ఆగస్టు 21న కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు తేదీలు కూడా ఆదివారం రోజే వస్తున్నాయి.


Indian Railways Sleeper Coaches: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రైలులో భారీగా తగ్గనున్న ఆ కోచ్ లు..


ఇదిలా ఉండగా.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డబుల్ దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అంటే.. వేరు వేరు ఫోన్ నంబర్లను ఉపయోగించి.. ఒకే యూజర్ ఐడీ కాకుండా.. ఎస్సై పోస్టులకు ఒక దరఖాస్తు.. కానిస్టేబుల్ పోస్టులకు వేరే నంబర్ ను ఉపయోగించి మరో దరఖాస్తును సమర్పించారు. ఇలా రెండు యూజర్ ఐడీలు ఉన్న వారిని అధికారులు గుర్తించారు. ఇలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దాదాపు మూడు లక్షలకు పైగా ఉన్నారని తెలిపారు.



ఇలా దరఖాస్తు చేసుకోవడానికి కారణం ఇదే..!
2018 పోలీస్ ఎస్సై, కానిస్టుబుల్ నోటిఫికేషన్ లో ప్రిలిమినరీలో అర్హత సాధించిన వారికి ఎస్సైకి, కానిస్టుబుల్ కు కలిపి ఒకే ఫిజికల్ టెస్టు ను నిర్వహించారు. మొదట ఎస్సైకి సంబంధించి ఈ పరీక్ష నిర్వహించగా.. చాలామంది ఫిజికల్ టెస్టులో క్వాలిఫై కాలేకపోయారు. దీంతో వాళ్లు కానిస్టేబుల్ కు కూడా.. ఈవెంట్స్ కు అర్హత లేకుండా అయిపోయిది. దీంతో వాళ్లు ఎంతో నష్టపోయినట్లు గ్రహించి.. ఈ సారి అలా కాకుండా.. రెండు దరఖాస్తులను వేర్వేరుగా అప్లై చేసుకున్నారు. ఎస్సై ఈవెంట్స్ నిర్వహిస్తున్న సమయంలో ఒకవేళ ఈవెంట్స్ క్వాలిఫై కాకపోతే.. కానిస్టేబుల్ కు మరో అవకాశం ఉంటుందని భావించారు.

NEET Botany Tips: బోటనీలో ఈ టాపిక్స్‌ ప్రిపేర్‌ అయితే చాలు.. నీట్‌(NEET)లో బెస్ట్ స్కోర్ మీ సొంతం..


ఇలా రెండు అవకాశాలు పొందొచ్చనే ఉద్దేశ్యంతో అభ్యర్థులు వేర్వేరు మొబైల్ నంబర్ ఇచ్చి దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారులు పదో తరగతి హాల్ టికెట్ ఆధారంగా.. వేర్వేరు మొబైల్‌ నంబర్లతో చేసుకొన్న అప్లికేషన్లను మెర్జ్‌ చేశారు. అభ్యర్థి మొదట ఏ మొబైల్‌ నంబర్‌తో దరఖాస్తు చేసుకున్నారో అదే యూజర్‌ ఐడీగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల పోస్టులకు ఒకేసారి ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తామని నియామక మండలి నోటిఫికేషన్‌లోనే స్పష్టంగా తెలిపినట్లు అధికారులు గుర్తు చేశారు. దరఖాస్తుల మెర్జింగ్‌పై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు 93937 11110, 93910 05006 నంబర్లను సంప్రదించాలని నియమక మండలి బోర్డు సూచించింది.

ఇదిలా ఉండగా.. పోలీస్ జాబ్స్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇలా ఒకే ఫిజికల్ టెస్టు నిర్వహించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఈవెంట్స్ ఎస్సైకి ఓ రోజు.. కానిస్టుబుల్ కు మరో రోజు కేటాయించాలని కోరుతున్నారు. అలా కుదరని పక్షాన ఫిజికల్ టెస్టు క్వాలిఫై అయిన వారికి ఎస్సై, కానిస్టుబుల్ కు అర్హతగా గుర్తించి.. ఈవెంట్స్ లో ఫెయిల్ అయిన వారికి కానిస్టుబుల్ కు మరో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించాలని కోరుతున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Police jobs, Telangana police jobs, Tslprb

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు