హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SBI Clerk Results: ఎస్బీఐ క్లర్క్ ఫలితాలకు అంతా సిద్ధం.. విడుదల తేదీ ఎప్పుడంటే..

SBI Clerk Results: ఎస్బీఐ క్లర్క్ ఫలితాలకు అంతా సిద్ధం.. విడుదల తేదీ ఎప్పుడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష 2022లో హాజరైన అభ్యర్థులకు శుభవార్త . ఈ పరీక్ష ఫలితాలను త్వరలో SBI విడుదల చేయనుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లేదా ibps.inలో తనిఖీ చేయవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష 2022లో హాజరైన అభ్యర్థులకు శుభవార్త.ఈ పరీక్ష ఫలితాలను త్వరలో SBI విడుదల చేయనుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లేదా ibps.inలో తనిఖీ చేయవచ్చు. ఈ కింది స్టెప్స్ ఫాలో అవుతూ ఫలితాలను చూసుకోవచ్చు. SBI క్లర్క్ 2022 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను తనిఖీ చేయడానికి.. అభ్యర్థి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలను చూడటానికి.. అభ్యర్థులు తమ రోల్ నంబర్ మరియు ఇతర వివరాలను నమోదు చేయాలి.

UGC-NET: యూజీసీ నెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.. దరఖాస్తు చేసుకోవడానికి స్టెప్స్ ఇవే..

మొత్తం 5008 జూనియర్ అసోసియేట్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం నవంబర్ నెలలో SBI పరీక్షను నిర్వహించింది. అయితే రిజల్ట్ ఎప్పుడనేది అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ.. ఈ వారంలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలో హాజరయ్యే అవకాశం ఉంటుంది.

ఫలితాలను ఇలా చెక్ చేయండి..

Step 1: అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ sbi.co.inకి వెళ్లండి.

Step 2: ఆ తర్వాత అభ్యర్థి హోమ్‌పేజీలో కెరీర్‌ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

Step 3: తర్వాత అభ్యర్థులు SBI క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితం 2022 కోసం అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.

Step 4: ఇప్పుడు అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి.

Step 5: అప్పుడు అభ్యర్థి యొక్క SBI క్లర్క్ ప్రిలిమ్స్ 2022 ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

Step 6: ఇప్పుడు అభ్యర్థులు ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Step7: చివరగా.. భవిష్యత్తు అవసరాలకు ఈ ఫిలితాలకు సంబంధించి పీడీఎఫ్ ను ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంగఠన్(KVS)లో పలు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్(Notification) జారీ అయింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మొత్తంగా 13 వేలకు పైగా ఫోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 05, 2022 నుంచి ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ‌ వంటి టీచింగ్, నాన్ టీచింగ్(Non Teaching) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో(Online) డిసెంబర్ 26లోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కానీ ఈ దరఖాస్తు గడువును మరో వారం రోజులు పెంచారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 02, 2023గా నోటీస్ లో పేర్కొన్నారు. అంటే దరఖాస్తుకు మరి కొన్ని గంటలు మాత్రమే ఉంది.

First published:

Tags: Bank, Bank Jobs, Bank Jobs 2022, JOBS, Sbi jobs

ఉత్తమ కథలు