హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS CPGET Results: నేడు తెలంగాణ CPGET ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

TS CPGET Results: నేడు తెలంగాణ CPGET ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

TS CPGET Results: నేడు తెలంగాణ CPGET ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

TS CPGET Results: నేడు తెలంగాణ CPGET ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ బోర్డ్ TS PG ప్రవేశ పరీక్ష 2022ని నిర్వహించింది. తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TS CPGET) ఆన్‌లైన్ దరఖాస్తులను 2022 జూన్ అండ్ జూలై నెలలో స్వకరించిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ బోర్డ్ TS PG ప్రవేశ పరీక్ష 2022ని నిర్వహించింది. తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TS CPGET) ఆన్‌లైన్ దరఖాస్తులను 2022 జూన్ అండ్ జూలై నెలలో స్వకరించిన సంగతి తెలిసిందే. ఇటీవల TS CPGET పరీక్షలను 11 ఆగస్టు నుండి 23 ఆగస్టు 2022 వరకు నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఫలితాలపై ఎలాంటి సమాచారం రాలేదు. తాజాగా ఈ ఫలితాలను సెప్టెంబర్ 16వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. ఓయూ (Osmania University) నిర్వహించిన CPGET– 2022లో 45 సబ్జెక్టులకు 67,115 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Telangana Jobs: అభ్యర్థుల ఆందోళనతో.. తెలంగాణలో మరో రిక్రూట్ మెంట్ రద్దు..

ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఓయూతో పాటు కాకతీయ, పాలమూరు, శాతా వాహన, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ వర్సిటీ, తెలంగాణ యూనివ్సిటీ, తెలంగాణ మహిళా వంటి వర్సీటీల్లో పీజీ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు స్పష్టంచేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://cpget.tsche.ac.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఈ సారి ఫలితాల్లో అర్హత సాధించిన మహిళలకు మహిళా యూనివర్సిటీలో కూడా అడ్మిషన్స్ పొందే అవకాశం ఉంది.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..

-ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

-సీపీ గెట్ రిజల్ట్స్ పై క్లిక్ చేయాలి.

-అభ్యర్థులు లాగిన్ ఐడీ మరియు పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

-మరో విండో ఓపెన్ అవుతుంది. దీనిలో మీ ఫలితాలను చూసుకోవచ్చు.

-చివరగా మీరు అర్హత సాధిస్తే కార్డును ప్రింట్ తీసుకొని.. భవిష్యత్ అవసరాలకు భద్రంగా మీ వద్దే ఉంచుకోవాలి.

IGNOU July 2022 Admission: మరోసారి రిజిస్ట్రేషన్ గడువు పొడిగించిన ఇగ్నో.. చివరి తేదీ ఎప్పుడంటే..

యూజీ ప్రవేశాల పరీక్ష ఫలితాలు విడుదల..

దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్​ యూనివర్సిటీల్లో యూజీ (UG) ప్రవేశాల కోసం నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ CUCET UG -2022 పరీక్షకు హాజరైన విద్యార్థులు ఈ పరీక్ష కు సంబంధించి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ cuet.samarth.ac.in లో చూసుకోవచ్చు. అభ్యర్థులు ఈ వెబ్ సైట్ నుంచి తమ స్కోర్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలను సెప్టెంబర్ 15 రాత్రి 10 గంటలకు ఫలితాలను విడుదల అయ్యాయి. సీయూసెట్ లో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులు యూనివర్సిటీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరో సారి సీయూసెట్-యూజీ కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Exam results, JOBS, Ts cpget 2022

ఉత్తమ కథలు