భారత తపాలా శాఖలో పలు పోస్టుల భర్తీకి రెండు నెలల క్రితం నోటిఫికేషన్(Notification) విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రామీణ డాక్ సేవక్(Grameen dak Sevak) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్(Online) ద్వారా దరఖాస్తులను సమర్పించారు. వీరిని పదో తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్(Post Master), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(Assistant Branch Post Master), డాక్ సేవక్ విధులు నిర్వహిస్తారు. ఏపీ పోస్టల్ సర్కిల్(Ap Postal Circle) గతంలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. అర్హత ఉన్న అభ్యర్థులు షెడ్యూల్ చేసిన తేదీల ప్రకారం పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఏపీ పోస్టల్ సర్కిల్ గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఆ ఫలితాలను ఏపీ పోస్టల్ GDS ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు.
అధికారిక పోర్టల్ లో ఏపీ గ్రామీణ డాక్ సేవకుల మెరిట్ జాబితా పీడీఎఫ్ ను అందుబాటులో ఉంచారు. ఎంపికైన అభ్యర్థులు పేర్లను ఈ జాబితాలో పొందుపరిచారు. ఏపీలో మొత్తం 1716 పోస్టులు, తెలంగాణకు 1226 పోస్టులకు ఫలితాలు వెలువడ్డాయి. అభ్యర్థులు ఫలితాల కోసం https://indiapostgdsonline.gov.in/లో చెక్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు గైర్హాజరు అవుతున్నారు. దీనికి సంబంధించి అధికారులు రిమైండర్ కు సంబంధించి నోటీస్ లను అధికారిక వెబ్ సైట్లో పొందుపరుస్తున్నారు. అయినా కొంతమంది హాజరు కాకపోవడంతో 5వ లిస్ట్ ను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ లిస్ట్ లో పేరు ఉన్న వాళ్లు అక్టోబర్ 6 లోపు ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.
తెలంగాణలో ఐదో జాబితా కింద 289, ఆంధ్రప్రదేశ్లో 509 మందిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలిచారు. ఈ అభ్యర్థులు అక్టోబర్ 6 లోపు తమ సర్టిఫికేట్లతో స్థానిక పోస్టాఫీసులో హాజరవ్వాలని కోరారు. గైర్హాజరైన అభ్యర్థులకు మరోసారి వెరిఫికేషన్ కు పిలిచే అవకాశం ఉండదని పేర్కొన్నారు.
మొదటి లిస్ట్ లో మెరిట్ ప్రకారం సెలెక్ట్ అయిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు జూలై 5 వరకు పిలవగా.. చాలామంది వెరిఫికేషన్ కు హాజరుకాలేదు. వారి కోసం మరో అవకాశాన్ని పోస్టల్ శాఖ అందించింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కాలేని వారు జూలై 20, 2022 వ తేదీ లోపు హాజరుకావాలని వెబ్ సైట్ లో పేర్కొన్నారు. అయినా రాకపోవడంతో సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ ను కూడా విడుదల చేశారు. ఇలా మొత్తం 5 లిస్ట్ లను వెబ్ సైట్లో ఉంచారు.
ఇది కూడా చదవండి : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. స్పెషల్ రిక్రూట్‌మెంట్ ద్వారా 2500 మందికి ఉద్యోగాలు ..
ఫలితాలను ఇలా చూసుకోవచ్చు..
ముందుగా అధికారిక వెబ్ సైట్https://indiapostgdsonline.gov.in/ ఓపెన్ చేయండి. హోమ్ పేజ్‌లో లెఫ్ట్ సైడ్ లో ఉన్నShortlisted Candidates లింక్ పై క్లిక్ చేయండి. తర్వాత రాష్ట్ర సర్కిల్ ఎంపిక చేసుకోవాలి. అందులో ప్లస్(+) సింబల్ గుర్తు ఉంటుంది. దానిని ఎంచుకుంటే.. ఆ పోస్టల్ సర్కిల్ లో 5వ లిస్ట్ కనిపిస్తుంది. అందులో ఉన్న పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ పీడీఎఫ్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap postal, Career and Courses, Gds, JOBS, Post office scheme