మిగిలిన ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ప్రకటించిన ఇంటర్ బోర్డు..

జూన్ 3న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.

news18-telugu
Updated: May 31, 2020, 6:34 PM IST
మిగిలిన ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ప్రకటించిన ఇంటర్ బోర్డు..
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీల పున:ప్రారంభం వాయిదా పడింది. ఈ మేరకు నాంపల్లిలో ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్మీడియట్ కోర్సులను అందించే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు అన్-ఎయిడెడ్, ఎయిడెడ్, కాంపోజిట్ కాలేజీలను వాస్తవానికి జూన్ ఒకటో తేదీనే తెరవాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో అన్ని జూనియర్ కాలేజీల పున:ప్రారంభ తేదీని తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాలేజీల పున:ప్రారంభ తేదీని త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. మిగిలిపోయిన ఇంటర్ పరీక్షలకు సంబంధించి జియోగ్రఫీ పేపర్-2, మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలను నిర్వహించే తేదీలను సైతం ఇంటర్ బోర్డు ప్రకటించింది.

జూన్ 3న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులు జూలై మూడో వారంలో నిర్వహించే అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల్లో రాసుకునే వెసులుబాటును కల్పించారు.
Published by: Narsimha Badhini
First published: May 31, 2020, 6:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading