మంచి బోధన, వసతులు, అవకాశాల కోసం అందరు విద్యార్థులు టాప్ యూనివర్సిటీల (Top Universities)లో చదవాలని కోరుకుంటారు. భవిష్యత్తులో చక్కగా స్థిరపడవచ్చని భావిస్తారు. ఇంతకుముందు ఆయా యూనివర్సిటీలకు ప్రత్యేక ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించేవారు. విద్యార్థులు వివిధ పరీక్షలకు ప్రిపేర్ కావాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి సమస్య లేదు. దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ఎంట్రెన్స్ టెస్ట్‌గా కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(CUET) నిర్వహిస్తున్నారు. తాజాగా 2023-24 అకడమిక్ ఇయర్ కోసం ఈ వారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కావచ్చు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేయనుంది.
* అర్హత ప్రమాణాలు
సీయూఈటీ-2023 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా అందుకు సమానమైన టెస్ట్‌లో పాసై ఉండాలి. 2023లో ఇంటర్ ఫైనలియర్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎంపిక చేసుకునే యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్‌ను ఫుల్‌ఫిల్ చేయాల్సి ఉంటుంది.
* మే 21 నుంచి పరీక్షలు
నోటిఫికేషన్ రీలీజ్ అయిన తరువాత సీయూఈటీ యూజీ అధికారిక వెబ్‌సైట్ cuet.samarth.ac.in ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది. సీయూఈటీ యూజీ 2023 పరీక్షలు మే 21న ప్రారంభమై, 31వ తేదీన ముగియనున్నాయి. ఈ మేరకు గతేడాది డిసెంబర్‌లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
* 13 ప్రాంతీయ భాషల్లో
సీయూఈటీ యూజీ-2023 పరీక్ష దేశవ్యాప్తంగా అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహించనున్నారు. ఇందుకు కోసం దేశవ్యాప్తంగా 1000 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి రోజూ 450 నుంచి 500 సెంటర్లను పరీక్ష కోసం వినియోగించనున్నారు.
* సీబీటీ విధానంలో పరీక్ష
సీయూఈటీ-2023 సిలబస్ బేసిక్‌గా 12వ తరగతి సబ్జెక్టులపై ఆధారపడి ఉంటుంది. డొమైన్-స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ సిలబస్ ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. అందుకు అనుగుణంగా అభ్యర్థులు ప్రిపరేషన్ కావాల్సి ఉంటుంది. సీయూఈటీ యూజీ -2023 అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ప్రశ్నాపత్రం MCQ రూపంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించనున్నారు.
ఇది కూడా చదవండి : విద్యార్థులకు ఫిబ్రవరి నెల కీలకం.. ఈ నెలలో ముఖ్యమైన ఈవెంట్స్ ఇవే..
* సిలబస్ వివరాలు
CUET సిలబస్‌లో జనరల్, సబ్జెక్ట్ రిలేటెడ్ వంటి రెండు డొమైన్స్ ఉంటాయి. జనరల్ సెక్షన్‌లో.. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్ (బేసిక్ మాథ్యమాటికల్ కాన్సెప్ట్స్ సింపుల్ అప్లికేషన్స్ అర్థమెటిక్/ఆల్జీబ్రా జామెట్రీ/మెన్సురేషన్/స్టాట్(8వ తరగతి వరకు)) లాజికల్ అండ్ అనలైటికల్ రీజనింగ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
సబ్జెక్ట్-స్పెసిఫిక్ సెక్షన్.. ఈ విభాగంలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్స్ సెట్ నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, అకౌంటెన్సీ, ఎకనామిక్స్ వంటి సబ్జె్క్టులకు చెందిన ప్రశ్నలు ఇందులో ఉంటాయి.
* టాప్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు
సీయూఈటీ స్కోర్ ఆధారంగా యూజీ కోర్సుల్లో ప్రవేశాలను ఈ యూనివర్సిటీలు కల్పిస్తున్నాయి. ప్రధానంగా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ- న్యూఢిల్లీ, జామియా మిలియా ఇస్లామియా- న్యూఢిల్లీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీ- కోల్‌కతా, అమృత విశ్వ విద్యాపీఠం-కోయంబత్తూరు, బనారస్ హిందూ యూనివర్సిటీ-వారణాసి, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్-మణిపాల్, కలకత్తా యూనివర్సిటీ- కలకత్తా, వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- వెల్లూర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్- హైదరాబాద్ వంటి యూనివర్సిటీలు ప్రవేశాలు కల్పించనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Cuet, EDUCATION, JOBS