ఇంజనీరింగ్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్(Post Graduation) లేదా ప్రభుత్వ ఉద్యోగాల(Government Jobs) కొరకు నిర్వహించే గేట్ పరీక్ష షెడ్యూల్(GATE Exam Schedule) విడుదలైంది. GATE 2023 సంవత్సరానికి ఈ షెడ్యూల్ విడుదల చేశారు. ప్రతి సంవత్సరం ఈ పరీక్షను వివిధ ఇంజనీరింగ్ శాఖలకు నిర్వహిస్తారు. ఇది M tech లేదా ఇతర పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేయడానికి లేదా PSUలో ఉద్యోగం పొందడానికి ప్రవేశ ప్రక్రియ. ఇప్పుడు గేట్ పరీక్ష (GATE Exam) కోసం రిజిస్ట్రేషన్(Registration) త్వరలో ప్రారంభమవుతుంది. దీని కోసం ఎలా నమోదు చేసుకోవాలి..? రిజిస్ట్రేషన్(Registration) కోసం కచ్చితంగా ఏ పత్రాలు అవసరమో తెలుసుకుందాం.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2023 కోసం రిజిస్ట్రేషన్ రేపటి నుండి అంటే ఆగస్టు 30 నుండి ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ నిర్వహిస్తోంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు GATE యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ 30 సెప్టెంబర్ 2022. GATE 2023 దరఖాస్తుల ప్రక్రియ అనేది అక్టోబర్ 7 వరకు ఉంటుంది.
రిజిస్ట్రేషన్ కోసం ఈ పత్రాలు అవసరం..
1. అభ్యర్థి ఫోటో అండ్ సంతకాన్ని స్కాన్ చేసి ఉంచుకోండి.
2. చెల్లుబాటు అయ్యే ఫోటో ID – ఆధార్ కార్డ్/పాస్‌పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్/PAN కార్డ్/ఓటర్ ID/కాలేజ్ ID జిరాక్స్ పత్రాలను దగ్గర ఉంచుకోవాలి.
3. డిగ్రీ/ ప్రొవిజనల్/ కోర్సు పూర్తి చేసిన సర్టిఫికెట్ ను కూడా రిజిస్ట్రేషన్ సమయంలో దగ్గర పెట్టుకోవాలి.
4. 5వ/6వ/7వ సెమిస్టర్ మార్క్‌షీట్‌ల ప్రింట్‌అవుట్‌లు కూడా అవసరమే.
5. హోమ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్/డీన్/రిజిస్ట్రార్/హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ షేర్ చేసిన ఫార్మాట్ ప్రకారం ఫైనల్ ఇయర్ విద్యార్థులు ప్రొవిజనల్ సర్టిఫికేట్ లెటర్‌ను సమర్పించాలి.
6. వైకల్యం లేదా పిడబ్ల్యుడి సర్టిఫికేట్ ఉండాలి. (If Applicable)
7. ప్రస్తుతం ఉన్నత డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసిస్తున్న అభ్యర్థులు అర్హత సాధించిన డిగ్రీ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేయాలి.
Jobs In Canara Bank: కెనరా బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా..
ఇలా నమోదు చేసుకోండి..
- gate.iitk.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న “గేట్ 2023 రిజిస్ట్రేషన్” లింక్‌పై క్లిక్ చేయండి.
- పోర్టల్‌లో మీ వివరాలను నమోదు చేసుకోవాలి.
- నమోదు చేసుకున్న తర్వాత.. సిస్టమ్ రూపొందించిన ID మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి.
- తర్వాత GATE 2023 దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి.. దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
- చివరకు GATE 2023 దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని.. భవిష్యత్తు సూచన కోసం దాని ప్రింటౌట్ తీసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Engineering course, Gate 2023, JOBS