హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IGNOU Admissions: ఇగ్నో అడ్మిషన్స్.. దరఖాస్తులకు కొన్ని గంటలే సమయం..

IGNOU Admissions: ఇగ్నో అడ్మిషన్స్.. దరఖాస్తులకు కొన్ని గంటలే సమయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU) రీ రిజిస్ట్రేషన్, కొత్త దరఖాస్తుల స్వీకరణ తేదీని ఇటీవల పొడిగించిన సంగతి తెలిసిందే. జనవరి 2023 సెషన్‌కి సంబంధించి ఆన్‌లైన్ డిస్టెన్స్ లెర్నింగ్(ODL) ప్రోగ్రామ్స్, మెరిట్ ఆధారిత ఆన్‌లైన్ డిస్టెన్స్ లెర్నింగ్(ODL) ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU) రీ రిజిస్ట్రేషన్, కొత్త దరఖాస్తుల స్వీకరణ తేదీని ఇటీవల పొడిగించిన సంగతి తెలిసిందే. జనవరి 2023 సెషన్‌కి సంబంధించి ఆన్‌లైన్ డిస్టెన్స్ లెర్నింగ్(ODL) ప్రోగ్రామ్స్, మెరిట్ ఆధారిత ఆన్‌లైన్ డిస్టెన్స్ లెర్నింగ్(ODL) ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. విద్యార్థులు, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. సర్టిఫికెట్, సెమిస్టర్ ఆధారిత కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు గడువును మార్చి 14 వరకు పొడిగిస్తున్నట్లు ఇగ్నో వెల్లడించగా.. ఇవి కాకుండా మిగతా అన్ని ప్రోగ్రామ్స్‌లో అడ్మిషన్ల కోసం మార్చి 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. ఈ అడ్మిషన్లకు దరఖాస్తుల ప్రక్రియ మరి కొన్ని గంటల్లో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ignouiop.samarth.edu.in వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చు.

అప్లికేషన్ ప్రాసెస్..

ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్‌ కోసం ignouiop.samarth.edu.in వెబ్‌సైట్‌ చెక్ చేయవచ్చు. ఆన్‌లైన్, ఓడీఎల్ ప్రోగ్రామ్స్ కోసం అభ్యర్థులు ignousamarth.edu.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి. సమయం తక్కువగా ఉన్నందున, ఆసక్తి ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోవాలని ఇగ్నో సూచించింది.

ఇగ్నో జనవరి 2023 సెషన్‌కి సంబంధించి అభ్యర్థులు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం.

- ముందుగా ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ఓపెన్ చేయాలి. అనంతరం ఇగ్నో వెబ్‌సైట్‌లోని హోం పేజీలో దిగువ భాగాన ‘అలర్ట్స్’(ALERTS)లో తాజా ప్రకటనకు సంబంధించిన లింక్ ఉంటుంది.

- ఇప్పుడు ‘The last date for Re-Registration, Fresh Admission for Online & ODL Programmes, Merit based ODL Programmes for January 2023 Session is extended till 20th March 2023 without late fees’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.

- కొత్తగా అప్లై చేస్తున్న వారైతే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అప్లికేషన్ ఫారం నింపాలి. అప్లికేషన్ ఫారం పూర్తయిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

TSPSC New Notification: అలర్ట్.. నేడు టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి మరో నోటిఫికేషన్..

- ఈ ప్రక్రియ పూర్తయ్యాక అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్‌లో పొందుపర్చిన వివరాలను మరొకసారి సరిచూసుకొని, సబ్మిట్ చేయాలి. కన్‌ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని తర్వాతి రిఫరెన్స్ కోసం భద్రపరుచుకోవాలి.

ఇగ్నో కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అప్లికేషన్ సమయంలో కొన్ని డాక్యుమెంట్లు కావాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన ఫొటోగ్రాఫ్, అభ్యర్థి సంతకం, అభ్యర్థి ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్, సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్‌లు, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం(If any), బీపీఎల్ సర్టిఫికెట్లను పొందుపర్చాలని ఇగ్నో తెలిపింది.

First published:

Tags: Career and Courses, JOBS

ఉత్తమ కథలు