కొత్తగూడెం మెడికల్ కళాశాలలో(Kothagudem Medical College) ఇటీవల 32 డేటా ఎంట్రీ ఆపరేటర్లు(Data Entry Operators), ఆఫీస్ సబార్డినేట్(Office Subordinates) పోస్టులకు కాంట్రాక్టు(Contract) పద్ధతిన భర్తీ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టుల నియమాక ప్రక్రియ అంతా.. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎంపిక ప్రక్రియను 'ఆరో ఎంటర్ ప్రైజెస్' అనే ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిం చారు. ఈ సంస్థ ద్వారానే అభ్యర్థులు కూడా దరఖాస్తులు(Applications) చేసుకున్నారు. దాదాపు 4వేల మంది నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వారిలో అర్హులైన వారికి మాత్రమే హాల్ టికెట్స్ ను(Hall Tickets) జారీ చేసింది ఈ ఏజెన్సీ సంస్థ. వీరందరికి ఆదివారం(సెప్టెంబర్ 11, 2022) మెడికల్ కళాశాలలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం ఈ పరీక్ష నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు.
అయితే ఈ పరీక్ష మరి కొన్ని నిమిషాల్లో జరుగుతుందనగా.. సుమారు 3 వేల మంది కళాశాలకు వచ్చి ఆందోళన చేపట్టారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 4వేల మంది అయితే.. వెయ్యి మందికే మీరు ఎలా హాల్ టికెట్స్ జారీ చేస్తారంటూ.. హాల్ టికెట్స్ రాని వారు కళాశాలకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఇలా సాయంత్రం వరకు కళాశాల ఆవరణ అంతా ఉద్రిక్తంగా మారింది.
పరీక్ష తేదీకి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని.. ఒక వేళ దరఖాస్తు రిజెక్ట్ అయిందంటే.. ఎందుకు చేశారో వివరణ కూడా ఇ్వవలేదని ఆ అభ్యర్థులు వాపోయారు. కేవలం 1000 మందికి మాత్రమే హాల్ టికెట్స్ పంపి.. మిగతా వారికి పంపకపోవడంలో ఏజెన్సీ యొక్క ఉద్దేశ్యం ఏంటని.. ప్రశ్నించారు. అంతే కాకుండా.. 400 మంది అభ్యర్థుులను ఒకే గదిలో పక్కపక్కనే కూర్చొబెట్టి.. పరీక్ష నిర్వహించాలని ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించకపోవడం.. మిగతా వారికి హాల్ టికెట్స్ ఎందుకు ఇవ్వలేదనే సమాధానాలు రాకపోవడంతో.. ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.లక్ష్మణరావు ప్రకటించారు. దీనికి పూర్తి బాధ్యతగా వహించిన ఆరో ఏజెన్సీని కూడా తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక కొత్త ఏజెన్సీ ద్వారా అక్టోబర్ చివరి వారంలో కొత్త ఏజెన్సీ ద్వారా పరీక్ష జరిగేలా చూస్తామని అక్కడ ఆందోళన చేపడుతున్న అభ్యర్థులకు ప్రిన్సిపాల్ భరోసా ఇచ్చాడు. దీంతో అభ్యర్థులు ఆందోళన విరమించి వెనుదిరిగారు.
ఆరో లాంటి ఏజెన్సీల వల్ల నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. అర్హత ప్రమాణాలు ఉండి.. పరీక్షలో ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని అభ్యర్థులు కళాశాల యాజమాన్యాన్ని కోరారు. తెలంగాణలో ఇటీవల జూనియర్ లైన్ మెన్ పరీక్షను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష కూడా రద్దు అవ్వడంతో.. తెలంగాణలో నిజాయితీగా నియామకాలు జరగడం లేదని.. ఇలా అయితే నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Telangana government jobs, Telangana jobs