తెలంగాణ ఎస్సై(SI), కానిస్టేబుల్(Constable) ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేసిన పోలీస్ నియామక బోర్డు.. ఈవెంట్స్(Events) త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. దీంతో నిరుద్యోగులు ఈవెంట్స్ పై కసరత్తు ప్రారంభించారు. తాజాగా ఈవెంట్స్ ఎప్పుడు నిర్వహిస్తారనే తేదీలను ఖరారు చేశారు. డిసెంబర్(December) 8 నుంచి జనవరి 03, 2023 వరకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 కేంద్రాల్లో ఈ శారీరర సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి రోజు నుంచి 23 నుంచి 25 రోజుల్లోపు ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయనున్నారు. ఈవెంట్స్ కు సంబంధించి అడ్మిట్ కార్డులను నవంబర్ 29 ఉదయం 8 గంటల నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ అడ్మిట్ కార్డులను డిసెంబర్ 03, 2022 వరకు వెబ్ సైట్లో ఉంచనున్నారు. వీటిని అభ్యర్థులు వ్యక్తిగత యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను ఉపయోగించి https://www.tslprb.in/ వెబ్ సైట్లో లాగిన్ అయి డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్ లో ఏమైనా సమస్యలు ఏర్పడితే..93937 11110 లేదా 93910 05006 నంబర్లను సంప్రదించవచ్చు. support@tslprb.in ఈ మెయిల్ ద్వారా కూడా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. శారీరక సామర్ధ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డులను వెంట తెచ్చుకోవాలని, బయోమెట్రిక్ ద్వారా పరీక్షలకు అనుమతిస్తారని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. పార్ట్ 2 అప్లికేషన్ , కమ్యూనిటీ సర్టిఫికేట్ ను వెంట తెచ్చుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
PET/PMT కేంద్రాలివే..
1. హైదరాబాద్- ఎస్ఏఆర్సీపీఎల్ - అంబర్పేట
2. సైబరాబాద్- 8వ బెటాలియన్ కొండాపూర్
3. రాచకొండ- సరూర్నగర్ స్టేడియం
4. కరీంనగర్- సిటీపోలీస్ శిక్షణ కేంద్రం
5. ఆదిలాబాద్- పోలీస్ పరేడ్ గ్రౌండ్
6. నిజామాబాద్ రాజారాం స్టేడియం, నాగారం(నిజామాబాద్)
7. మహబూబ్నగర్- డిస్ట్రిక్ట్ స్టేడియం స్పోర్ట్స్ గ్రౌండ్
8. వరంగల్- హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం
9. ఖమ్మం- పోలీస్ పరేడ్ గ్రౌండ్
10. నల్గొండ- మేకల అభినవ్ స్టేడియం
11. సంగారెడ్డి (సిద్దిపేటలో కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Police jobs, Telangana government jobs, Tslprb