హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Halltickets: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు.. వివరాలిలా..

TSPSC Halltickets: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు.. వివరాలిలా..

Telangana Jobs: అభ్యర్థుల ఆందోళనతో.. తెలంగాణలో మరో రిక్రూట్ మెంట్ రద్దు..

Telangana Jobs: అభ్యర్థుల ఆందోళనతో.. తెలంగాణలో మరో రిక్రూట్ మెంట్ రద్దు..

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తుల పక్రియ కూడా ముగిసింది. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 24 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తుల పక్రియ కూడా ముగిసింది. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ 24 పోస్టులకు 16,381 దరఖాస్తులు(Applications) వచ్చాయి. దీనికి సంబంధించి ఆన్ లైన్ పరీక్ష నవంబర్ 7, 2022 న నిర్వహించనున్నట్లు కమిషన్ వెబ్ సైట్ లో వెబ్ నోటీస్(Web Notice) జారీ చేసింది టీఎస్పీఎస్సీ. దీనికి సంబంధించి హాల్ టికెట్స్ పరీక్షకు వారం రోజుల ముందు అంటే నవంబర్ 1, 2022 నుంచి కమిషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Jobs In NAL: బీటెక్(B Tech), బీఎస్సీ(B.Sc) విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ 75 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండిలా.. 

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జూలై 2022లో విడుదల చేశారు. 24 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ జూలై 29న ప్రారంభం కాగా.. దరఖాస్తులను ఆగస్టు 26 వరకు దరఖాస్తులను స్వీకరించారు.

టీఎస్పీఎస్సీ నుంచి విడుదలైన నోటిఫికేషన్ల వివరాలు..

1. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాలు ..

మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.

అర్హత: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి డిప్లొమా(D.C.E./L.C.E./L.A.A.) ఉండాలి. (లేదా) డిగ్రీ (బీఆర్క్) లేదా బీఈ/బీటెక్ (సివిల్)/ బీప్లానింగ్/బీటెక్ (ప్లానింగ్) ఉత్తీర్ణత ఉండాలి.

Constable Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 400 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల 1540 పోస్టుల భర్తీకి సంబంధించి ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అక్టోబర్ 14, 2022 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో స్వీకరిస్తారు.

వయోపరిమితి..

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అర్హతలు..

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (మిషన్ భగీరథ), పీఆర్ అండ్ ఆర్ డీ విభాగంలోని ఏఈఈ పోస్టులు, ఎంఏ అండ్ యూడీ పీహెచ్ విభాగంలో పోస్టులకు , టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్, టీఆర్ అండ్ బీ విభాగంలోని పోస్టులకు సివిల్ విభాగంలో బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఐ అండ్ సీఏడీ విభాగంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఐఅండ్ సీఏడీ విభాగంలో( మెకానికల్) ఏఈఈ పోస్టులకు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఏఈఈ ఎలక్ట్రికల్ టీఆర్ అండ్ బీ విభాగంలోని పోస్టులకు ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

అన్ని నోటిఫికేషన్స్ కు అధికారికి వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు.

3. ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు..

టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి ఇటీవల మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మహిళలకు మాత్రమే అర్హత ఉంది. ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 10న దరఖాస్తులకు చివరి తేదీగా పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు. మల్టీజోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మల్టీ జోన్ 1 లో మొత్తం 17 పోస్టులు ఉండగా.. మల్టీ జోన్ 2 లో మొత్తం 06 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ. 1,27,310 చెల్లించనున్నారు.

అర్హతలు ఇలా..

హోం సైన్స్ లేదా సోషల్ సైన్స్, లేదా ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా.. బోటనీ, బయాలజీ, బయో కెమిస్ట్రీ తో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Food safty officers, JOBS, TSPSC, Tspsc jobs

ఉత్తమ కథలు