ఇంజనీరింగ్ విద్యలో పీజీ ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (Graduate Aptitude Test in Engineering)–2023 పరీక్ష షెడ్యూల్ వారం రోజుల్లో విడుదల కానుంది. అంటే ఈనెల చివరన లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈసారి ఐఐటీ కాన్పూర్ (GATE) పరీక్షను నిర్వహించనుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 4 నుంచి 13వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. దాని ఫలితాలు మార్చి 2023లో వస్తాయి. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు (Admit Cards) జనవరి లో విడుదలకానున్నాయి. అభ్యర్థులు మొత్తం షెడ్యూల్‌ను, అడ్మిట్ కార్డులను ఐఐటీ కాన్పూర్ (Kanpur) అధికారిక వెబ్‌సైట్ https://gate.iitk.ac.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
అభ్యర్థులు పరీక్ష రోజు వరకు అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, హాల్ టికెట్ (Hall Ticket) హార్డ్ కాపీని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలని పేర్కొంది. అయితే గత ఏడాది 7.11లక్షల మంది గేట్ పరీక్ష రాయగా.. 1.26 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గేట్ 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం అయి.. సెప్టెంబర్ 14 వరకు కొనసాగనుంది. గేట్ పరీక్షను రాయడానికి ఎలాంటి వయస్సుతో సంబంధం లేదు. టెక్నాలజీ లేదా ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లలో ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు లేదా చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు GATE 2023 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మన దేశంతో పాటు.. ఈ పరీక్షను నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, సింగపూర్, ఇథియోపియా, UAE దేశస్తులు కూడా రాసుకోవచ్చు. గేట్ 2023 అభ్యర్థులు మొత్తం రెండు పేపర్లలో హాజరు కావడానికి అనుమతిస్తుంది. ఇందులో మల్టిపుల్ చాయిస్ పరీక్షలు అలాగే న్యూమరికల్ ఆన్సర్-టైప్ ప్రశ్నలు ఉంటాయి. గేట్ పరీక్షను రెండు రకాలుగా విభజించారు. అనగా నావల్ ఆర్కిటెక్చర్ మరియు మెరైన్ ఇంజనీరింగ్. గేట్ 2023 పరీక్ష కోసం మొత్తం 29 పేపర్లు ఉంటాయి. గేట్ పరీక్ష స్కోర్‌తో అభ్యర్థులు తమకు అవసరమైన కోర్సులో ప్రవేశం పొందొచ్చు. అంతే కాకుండా.. GATE స్కోర్ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. వీటికి PSUలు, GOI సంస్థలు ఈ ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తుంటాయి.
గేట్ పరీక్ష రాయబోతున్న అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని, ఆపై దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్ ఫార్మాట్‌లో పూరించాల్సి ఉంటుంది. లాగిన్ చేయడానికి మీ ఇమెయిల్ ఐడి మరియు OTPని ఉపయోగించి మీ మొబైల్ నంబర్‌ను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి పరీక్ష ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ. 1500, రిజర్వేషన్ అభ్యర్థులకు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారికి వెబ్ సైట్ ను సందర్శించండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Gate, Gate 2023, JOBS