ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్(Notification) వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 710 పోస్టులు భర్తీ చేయబడతాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ibps.in వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.
IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవడానికి చివరి తేదీ 01 డిసెంబర్ 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి , ఫీజులను ఆన్లైన్లో చెల్లించడానికి చివరి తేదీ ఈరోజు అంటే 21 నవంబర్ 2022గా ఉంది.
దరఖాస్తు విధానం ఇలా..
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అంటే ibps.inకి వెళ్లండి.
-ఇక్కడ హోమ్‌పేజీలో IBPS SO రిక్రూట్మెంట్ 2022 అనే లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
-ఇలా చేయడం వల్ల కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు మీ లాగిన్ వివరాలను నమోదు చేయాలి. లాగిన్ వివరాలను నమోదు చేసి, ఎంటర్ బటన్ నొక్కండి.
-ఇప్పుడు మరో పేజీలో మీ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. తర్వాత దరఖాస్తు రుసుమును కూడా చెల్లించండి.
-ప్రక్రియ పూర్తయిన తర్వాత, సమర్పించు అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
-ఇలా చేయడం ద్వారా మీ దరఖాస్తు సమర్పించబడుతుంది.
-ఇప్పుడు ఈ పేజీలో మీ దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని హార్డ్‌కాపీని తీసి ఉంచండి. ఇది మీ భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు.
ఖాళీలు
ఈసారి నిర్వహించే పరీక్షలతో మొత్తం 710 ఖాళీలను భర్తీ చేయాలని IBPS లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఐటీ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుకు 44, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్ I) 516, రాజభాష అధికారి (స్కేల్ I) 25, లా ఆఫీసర్ (స్కేల్ I) 10, హెచ్ఆర్/పర్సనల్ 15 ఖాళీలు, స్కేల్ I అధికారి , మార్కెటింగ్ అధికారి పోస్టులు 100 ఖాళీగా ఉన్నాయి.
పరీక్ష తేదీలు..
ఈ పోస్టులకు ప్రిలిమినరీ ఆన్ లైన్ పరీక్ష డిసెంబర్ 24 , 31 డిసెంబర్ 2022న నిర్వహించబడుతుంది. ప్రలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులయిన వారు.. మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇది 29 జనవరి 2023న నిర్వహించబడుతుంది. పూర్తి వివరాలకు తెలుసుకోవడానికి మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, IBPS, Ibps rrb, JOBS, Jobs in banks