హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC New Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడో, రేపో 738 పోస్టులకు నోటిఫికేషన్..

TSPSC New Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడో, రేపో 738 పోస్టులకు నోటిఫికేషన్..

(ఫ్రతీకాత్మక చిత్రం)

(ఫ్రతీకాత్మక చిత్రం)

మార్చిలోని బడ్జెట్ సమావేశాలలో పాల్గొన్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మొత్తం 80 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కొన్ని పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు పొందింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

మార్చిలోని బడ్జెట్ (Budget) సమావేశాలలో పాల్గొన్న సీఎం కేసీఆర్(CM KCR) రాష్ట్రంలో మొత్తం 80 వేలకు పైగా ఉద్యోగాలు(Jobs) ఖాళీగా ఉన్నాయని.. ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కొన్ని పోస్టులకు ఆర్థిక శాఖ(Finance Ministry) అనుమతులు పొందింది. దాదాపు 52వేలకు పైగా పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి లభించింది. దీనిలో భాగంగానే.. టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి నోటిఫికేషన్లు(Notifications) విడుదల అయ్యాయి. ఇక మిగిలిన శాఖల్లో కూడా ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన పోస్టుల్లో గ్రూప్ 2(Group 2), గ్రూప్ 3(Group 3) పోస్టులు ఉన్నాయి. త్వరలోనే గ్రూప్ 4లో ఖాళీగా ఉన్న 9వేలకు పైగా పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రానున్నాయి. గ్రూప్‌ 1- 500కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. ఈ పరీక్ష అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.

ఇదిలా ఉండగా.. పాలిటెక్నిక్‌ కాలేజీ, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత స్పష్టంగా కనపడుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఈ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్‌ జారీచేయనున్నది. దీనిలో భాగంగానే ఈ పోస్టుల భర్తీకి నియమ నిబంధనలతో కూడిన వివరాలను అధికారులు టీఎస్‌పీఎస్సీకి ఇటీవలే అందజేశారు. టీఎస్పీఎస్సీకి అందజేసిన పోస్టుల్లో డిగ్రీ లెక్చరర్‌ 491 ఉండగా.. సాంకేతిక విద్యలో 247 లెక్చరర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 738 లెక్చరర్‌ పోస్టులకు నేడో, రేపో నోటిఫికేషన్ రానుంది. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ఆర్థిక శాఖ వేర్వేరుగా రెండు జీవోలను జారీ చేసింది.

TCS Jobs 2022: ఫ్రెషర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన TCS.. ఆ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

డిగ్రీ లెక్చరర్ పోస్టుల్లో..

S. Noపోస్టు పేరుఖాళీ సంఖ్య
1కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లయిన్సెస్‌311
2బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌39
3ఇంగ్లిష్‌23
4తెలుగు27
5సంస్కృతం23
6డాటా సైన్స్‌12
7వివిధ విభాగాల్లో..56

సాంకేతిక విద్యాశాఖలో(పాలిటెక్నిక్ కాలేజీల్లో)

S. Noపోస్టు పేరుఖాళీ సంఖ్య
1సివిల్ ఇంజనీరింగ్82
2ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌24
3ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌41
4మెకానికల్‌36
5ఆటోమొబైల్‌15
6ఇతర విభాగాల్లో..49

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 132 ప్రభుత్వ డిగ్రీ కలేజీలు ఉన్నామయి. వీటిలో మొత్తం 4098 పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే వీటిలో 1255 పోస్టులు రెగ్యూలర్ కేడర్ లో ఉన్నాయి. వీటిని 2012 సంవత్సరంలో భర్తీ చేశారు. ఇక మిగిలిన 812 పోస్టులు కాంట్రాక్ట్, 1940 పోస్టులు గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు.

తెలంగాణలో మొత్తం 54 పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిలో మొత్తం 3,647 పోస్టులు ఉన్నాయి. దీనిలో కూడా దాదాపు 11 వందలకు పైగా లెక్చరర్లు రెగ్యూలర్ బేసిస్ మీద పని చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ పద్ధతిలో 405 లెక్చరర్లు పనిచేస్తున్నారు. కొత్తగా పై పోస్టులు నియామకం జరిగితే.. లెక్చరర్ల కొరత తీరే అవకాశం ఉంటుంది.

First published:

Tags: Career and Courses, Degree posts, JOBS, Polytechnic colleges, TSPSC, Tspsc jobs

ఉత్తమ కథలు