Home /News /jobs /

UGC-NET exam: యూజీసీ నెట్ పరీక్ష రాసే అభ్యర్ధులకు అలర్ట్.. మీరు గమనించాల్సిన విషయాలు ఇవే..!

UGC-NET exam: యూజీసీ నెట్ పరీక్ష రాసే అభ్యర్ధులకు అలర్ట్.. మీరు గమనించాల్సిన విషయాలు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UGC-NET exam: దేశంలో కోవిడ్​ పరిస్థితుల కారణంగా 2020 డిసెంబర్ సెషన్​ పరీక్షను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, ఈ పరీక్షను ఇప్పటికీ నిర్వహించలేదు. మరోవైపు, 2021 జూన్​ సెషన్​కు సైతం పరీక్షలు నిర్వహించాల్సి రావడంతో.. రెండింటిటీ విలీనం చేసి కంబైన్​గా పరీక్ష నిర్వహించాలని నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్​టీఏ) నిర్ణయించింది.

ఇంకా చదవండి ...
యూనివర్సిటీలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్​ రీసెర్చ్​ ఫెలోల ఎలిజిబిలిటీ కోసం ఏటా రెండు సార్లు నిర్వహించే యూజీసీ నెట్(UGC-NET exam) పరీక్ష తేదీలు మారాయి. దేశంలో కోవిడ్​ పరిస్థితుల కారణంగా 2020 డిసెంబర్ సెషన్​ పరీక్షను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, ఈ పరీక్షను ఇప్పటికీ నిర్వహించలేదు. మరోవైపు, 2021 జూన్​ సెషన్​కు సైతం పరీక్షలు నిర్వహించాల్సి రావడంతో.. రెండింటిటీ విలీనం చేసి కంబైన్​గా పరీక్ష నిర్వహించాలని నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్​టీఏ) నిర్ణయించింది. కొత్త వారితో పాటు, 2020 డిసెంబర్​ సెషన్​కు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు సైతం 2021 జూన్​ సెషన్​కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ రెండు సెషన్లకు సంబంధించిన కంబైన్డ్​ ఎగ్జామ్స్​ డేట్స్​ను ప్రకటించింది. కొత్త పరీక్షల షెడ్యూల్ ప్రకారం, యూజీసీ నెట్​ పరీక్షలు రెండు బ్లాకులుగా జరగనున్నాయి.

అక్టోబర్ 6 నుంచి -8 వరకు ఒక బ్లాక్​, తిరిగి అక్టోబర్ 17 నుంచి -19 వరకు మరో బ్లాక్​లో పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే, గతంలో విడులైన షెడ్యూల్​ ప్రకారం యూజీసీ నెట్​ 2021 పరీక్షలు అక్టోబర్ 6 నుంచి 11వ తేదీ వరకు జరగాల్సి ఉంది. కానీ, అక్టోబర్​ 10న కొన్ని పోటీ పరీక్షల ఉన్నందున అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు షెడ్యూల్ మారుస్తూ ఎన్​టీఏ నిర్ణయం తీసుకుంది.

అక్టోబర్​లో జరగనున్న పరీక్షలు..

2021 జూన్​ సెషన్​కి సంబంధించిన యూజీసీ నెట్​ నోటిఫికేషన్ ఆగస్టు10న విడుదలైంది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా అప్పుడే ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి రేపు (సెప్టెంబర్ 5) రాత్రి 11:50 గంటల వరకే సమయం ఉంది. సెప్టెంబర్ 6 రాత్రి 11:50 గంటల వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు- www.ugcnet.nta.nic.in, nta.ac.in వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.

దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే వాటి సవరణకు సెప్టెంబర్​ 6 నుంచి 12వ తేదీ వరకు అవకాశం కల్పించింది. జేఆర్​ఎఫ్​ కొరకు యూజీసీ నెట్​ దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2021అక్టోబర్ 1 నాటికి 31 సంవత్సరాలు మించరాదు. అయితే, అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం యూజీసీ నెట్​కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు విషయంలో ఎటువంటి గరిష్ట వయోపరిమితి లేదు.

ఇది కూడా చదవండి : ఈ సారి జార్వో మామ ఎంట్రీ ఇచ్చే గెటప్ అదేనా..! ఫ్యాన్స్ అంచనాలు నిజమయ్యేనా..!

మరోవైపు, పీహెచ్ డీ ఉంటేనే యూనివ‌ర్సిటీల్లో టీచింగ్ పోస్టుల‌కు అర్హ‌త ఉంటుంది. యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ (ఎంట్రీలెవెల్‌) పోస్ట‌లుకు పీహెచ్‌డీ త‌ప్ప‌నిస‌ర‌ని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) స్ప‌ష్టం చేసింది. ఇప్పటి నుంచి నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్‌) అర్హ‌త‌తో యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేర‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. ఇప్ప‌టివ‌ర‌కు యూనివ‌ర్సిటీల్లో, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫెస‌ర్లను నేరుగా నియ‌మించ‌డానికి మాస్ట‌ర్ డిగ్రీతోపాటు నెట్‌లో అర్హ‌త‌, పీహెచ్‌డీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: EDUCATION, Exams, JOBS, UGC NET

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు