హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC NET Answer Key: అభ్యర్థులకు అలర్ట్.. UGC NET ఓఎంఆర్, ఆన్సర్ కీ విడుదల..

UGC NET Answer Key: అభ్యర్థులకు అలర్ట్.. UGC NET ఓఎంఆర్, ఆన్సర్ కీ విడుదల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UGC NET పరీక్షకు హాజరైన లక్షల మంది అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

UGC NET పరీక్షకు హాజరైన లక్షల మంది అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. ఈ సంవత్సరం పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి సమాధాన కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాని కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in సందర్శించాలి. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు జవాబు కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. UGC NET డిసెంబర్ 2022 సైకిల్ (ఫేజ్ I-IV) పరీక్షలు ఫిబ్రవరి 21 నుండి మార్చి 16, 2023 వరకు నిర్వహించారు. అనేక షిఫ్టులలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

ఆన్సర్ కీని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

-జవాబు కీని డౌన్‌లోడ్ చేయడానికి.. ముందుగా అధికారిక వెబ్‌సైట్ అంటే ugcnet.nta.nic.inకి వెళ్లండి.

-ఇక్కడ హోమ్‌పేజీలో లింక్ ఇవ్వబడుతుంది - UGC NET 2023 జవాబు కీ పై క్లిక్ చేయండి.

-మీరు దీన్ని చేసిన వెంటనే.. మీరు మీ లాగిన్ వివరాలను నమోదు చేసిన వెంటనే మరో పేజీ ఓపెన్ అవుతుది.

-ఆ పేజీలో మీ అన్సర్ కీ కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

-దీన్ని ఇక్కడ నుండి మీ సమాధానాలకు చెక్ చేసుకోవచ్చు.

-ఇక్కడే మీ ఆన్సర్ కీ ఓఎంఆర్ పేపర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు.

-దీని హార్డ్‌కాపీ భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది.

UGC NET ఆన్సర్ కీపై అభ్యంతరాలను రేపటి వరకు అంటే 25 మార్చి 2023 వరకు చేయవచ్చు. ఫీజుల సమర్పణకు రేపు రాత్రి 11.50 గంటల వరకు అవకాశం ఉంటుంది. ప్రతి అభ్యంతరానికి, అభ్యర్థులు రూ. 200 రుసుము చెల్లించాలి. అది తిరిగి చెల్లించబడదు. అభ్యంతరాలను నిపుణుల ప్యానెల్ పరిగణనలోకి తీసుకుంటుంది. ఏవైనా ఉంటే మార్పులతో పాటు తుది సమాధాన కీ విడుదల చేయబడుతుంది.

యూజీసీ నెట్ జవాబు కీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

యూజీసీ నెట్ విడుదల చేసిన నోటీస్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

First published:

Tags: Career and Courses, Csir ugc net, JOBS, UGC, UGC NET

ఉత్తమ కథలు