యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం ఏటా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) నిర్వహిస్తుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఆధ్వర్యంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసే వాళ్ల కోసం వేర్వేరుగా ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయి. అనంతరం మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ ఏడాది అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం యూజీసీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 9న ప్రారంభించగా మార్చి 12 వరకు స్వీకరించారు. అయితే తాజాగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అప్లికేషన్ కరెక్షన్ విండోను ఓపెన్ చేశారు. ఏప్రిల్ 01వ తేదీన ఓపెన్ అయిన ఈ విండో మరో రెండు రోజుల్లో ముగుస్తుంది. అంటే.. ఏప్రిల్ 03 వరకు ఈ విండో ఓపెన్ లో ఉండనుంది. ఇక.. మే 21 నుంచి 31 వరకు సీయూఈటీ (CUET-2023) పరీక్ష జరుగుతుంది.
పరీక్ష CBT మోడ్‌లో ఉంటుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని వివిధ కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. CUET UG పరీక్ష 2023 కోసం అడ్మిట్ కార్డ్ మరియు అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ కూడా త్వరలో విడుదల చేయబడుతుంది. తాజా సమాచారం కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను cuet.samarth.ac.in తనిఖీ చేస్తూ ఉండాలని అభ్యర్థించారు.
ఇక మీ దరఖాస్తులో తమ పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, ఫోటోగ్రాఫ్, సంతకం, 10 మరియు 12వ తరగతి వివరాలు, పరీక్ష నగర ఎంపిక, పుట్టిన తేదీ, లింగం, వర్గం, ఉప వర్గం వంటి ఫీల్డ్‌లలో మార్పులు చేయవచ్చు. అంతే కాకుండా.. మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా, అడ్రస్ ఛేంజ్.. సబ్జెక్ట్, పరీక్షతో పాటు యూనివర్సిటీ, ప్రోగ్రామ్, కోర్సు మొదలైన వాటిలో మార్పులు చేయవచ్చు.
ఉచిత సేవలు..
22 హెల్ప్‌లైన్ సెంటర్లను అభ్యర్థులకు కొరకు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు NTA వెబ్‌సైట్ http://nta.ac.in లేదా http://cuet.samarth.ac.in వెబ్‌సైట్లలో చూడచ్చు. అనంతరం ఆయా కేంద్రాలకు వెళ్లి అక్కడ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇదే మాదిరిగా భారతీయ యూనివర్సిటీల్లో చదువుకోవాలను వారి కోసం కూడా యూజీసీ ఈ పరీక్ష నిర్వహిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Cuet, CUET 2023, JOBS