మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నీట్ అభ్యర్థులకు (Neet candidates) తీపి కబురు అందించింది. తాజాగా ఎంసీసీ (MCC) నీట్ యూజీ కౌన్సెలింగ్ (NEET UG Counseling) 2021 రౌండ్ 1 రిజిస్ట్రేషన్ విండోను మళ్లీ ఓపెన్ చేసింది. ఎంసీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న షెడ్యూల్ ప్రకారం, నీట్ యూజీ కౌన్సెలింగ్ (NEET UG Counseling) 2021కి సంబంధించిన ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 28న ప్రారంభమై, జనవరి 30 మధ్యాహ్నం ముగుస్తుంది. ఈ సమయంలోగా ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన mcc.nic.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఇది పూర్తయ్యాక ఆలిండియా కోటా..
రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు (Registration Processing fee) చెల్లించడానికి జనవరి 30 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. అయితే అభ్యర్థులు తమ ఆప్షన్లను రాత్రి 11:55 గంటల లోగా ఫిల్ చేసుకుని, లాక్ చేయవచ్చు. షెడ్యూల్ ప్రకారం, జనవరి 31న సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. ఇది పూర్తయ్యాక ఆల్ ఇండియా కోటా (AIQ) రౌండ్ 1కి సంబంధించిన సీట్ల కేటాయింపు వివరాలను లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియ (Registration process) ఫలితాలను ఎంసీసీ ఫిబ్రవరి 1న ప్రకటిస్తుంది. రౌండ్ 1లో సీట్లు పొందిన అభ్యర్థులు ఫిబ్రవరి 2 - 7 మధ్యలో సంబంధిత కాలేజీల్లో (Colleges) రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ముందుగా కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం రిజిస్టర్ (Register) చేసుకోవాలి. ఆపై ఆన్‌లైన్‌లో తమ ప్రిఫెరెన్స్ ప్రకారం నచ్చిన కోర్సు/కాలేజ్ ఫిల్ చేసి, లాక్ చేయాలి. అభ్యర్థులు ఎంచుకున్న కోర్సు (Course), కాలేజీ, నీట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని ఎంసీసీ సీట్లు కేటాయిస్తుంది. చివరి తేదీ కంటే ముందు అభ్యర్థి తన ప్రిఫెరెన్స్ లాక్ చేయకపోతే, ఆప్షన్స్ ఆటోమేటిక్‌గా లాక్ అవుతాయి.
* నీట్ యూజీ కౌన్సెలింగ్ 2021: రిజిస్ట్రేషన్ ప్రాసెస్
స్టెప్ 1. ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యాక హోమ్‌పేజీ (Home page)లో 'న్యూ రిజిస్ట్రేషన్ (New Registration)' లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 2. రిజిస్ట్రేషన్ కోసం నీట్ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, ఇతర సమాచారం వంటి మీ వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 3. కౌన్సెలింగ్ ఫీజులను ఆన్‌లైన్ (Online)లో చెల్లించండి.
స్టెప్ 4. అందుబాటులో ఉన్న కోర్సులు, కాలేజీల లిస్టు నుంచి మీ ప్రిఫరెన్స్ ను లాక్ చేయండి. ఫిల్ చేయగల ఆప్షన్ల సంఖ్యపై ఎలాంటి లిమిట్ లేదు.
గత సంవత్సరాల్లో లాగా రెండు రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను రాష్ట్ర కోటాలో మార్చకుండా ఈ ఏడాది ఎంసీసీ నాలుగు రౌండ్ల కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుంది. ఇందులో రౌండ్ 1, రౌండ్ 2, మాప్-అప్ రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్ లు ఉంటాయి. మొదటి మూడు రౌండ్లలో మాత్రమే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల సమయంలో ఓటీపీని అందుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లు, ఈమెయిల్ ఐడీలో ఓటీపీలను పొందుతారని ఎంసీసీ తెలిపింది. ఇది Sandes యాప్ ద్వారా కూడా అందుబాటులో ఉంటుంది. దీనిలో విద్యార్థులు ఓటీపీని యాక్సెస్ చేయడానికి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.