తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ నుంచి పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. కొన్ని పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మరికొన్ని పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియా కొనసాగుతోంది. నేటితో డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్(DAO) ఉద్యోగాల దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఇక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(AEE) పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి నోటిఫికేషన్(Notification) ఈ నెల 15న రిలీజ్ కానుంది. దీనికి అప్లికేషన్స్(Applications) అనేది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 12 వరకు కొనసాగనుంది. ఇలా వరుస నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగిసిన విషయం తెలసిందే. ఈ పరీక్ష అక్టోబర్ 16న నిర్వహించనున్నారు.
వరుస నోటిఫికేషన్ల నేపథ్యంలో నిరుద్యోగులు ఇప్పటికే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3కు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం కనిపిస్తోంది. వీటికి ఇప్పటికే ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఫారెస్ట్ డిపార్ట్ మెంట్లో ఖాళీగా ఉన్న 1665 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతన్నాయి. దీనికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్(FBO), ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్(FRO), ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ (FSO) వంటి కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. నేడో , రేపో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వీటిలో అత్యధికంగా 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులున్నాయి. వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
నేటి నుంచి దరఖాస్తులు..
తెలంగాణలోని (Telangana) ములుగు జిల్లాలో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆగస్టు 22, 2022న దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్(Notification) వెలువడింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేసి దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 30, 2022. దీని ద్వారా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు ఫీజును రూ.500 గా నిర్ణయించారు. ఈ ఫీజును ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో ఓటీఆర్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చేసుకున్న అభ్యర్థులు ఓటీఆర్ నంబర్ ను ఎంటర్ చేసి.. తగిన వివరాలతో దరఖాస్తును పూర్తి చేయాలి.
వీటికి దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థుల యొక్క వయోపరిమితి 21 నుంచి 61 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి జీతభత్యాలలో తేడా ఉంటుంది. ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,44,200,, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,31,400, ప్రొఫెసర్ పోస్టులకు రూ.57,700 చెల్లిస్తారు. పూర్తి వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Fbo, Forest jobs, Fro, JOBS, Telangana government jobs