THE INTER BOARD OFFICIALS HAVE RELEASED A STATEMENT THAT CHANGES HAVE BEEN MADE IN THE TELANGANA INTERMEDIATE INTER SECOND YEAR ENGLISH SYLLABUS VB
TS Intermediate Syllabus: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. మారిన ఆ పేపర్ సిలబస్.. వివరాలిలా..
(ప్రతీకాత్మక చిత్రం)
TS Intermediate Syllabus: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంటర్ సెకండ్ ఇయర్ మొదటి లాంగ్వేజ్ (ఇంగ్లీష్) సిలబస్ లో మార్పులు చేసినట్లు ఇంటర్ బోర్డు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ఇంటర్మీడియట్(Telangana Intermediate) విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంటర్ సెకండ్ ఇయర్(Inter Second Year) మొదటి లాంగ్వేజ్(First Language) (English) సిలబస్ లో(Syllabus) మార్పులు చేసినట్లు ఇంటర్ బోర్డు(Inter Board) అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. మారిన సిలబస్ ను వచ్చే విద్యాసంవత్సరం(2022-23) నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. మారిన సిలబస్ తో కూడిన పుస్తకాలను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటికే ఇంటర్ లో ఫెయిల్(Inter Fail) అయిన విద్యార్థులకు ఈ మారిన సిలబస్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇంగ్లీష్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు పాత సిలబస్ ఆధారంగానే పరీక్షలు ఉంటాయన్నారు. ఈ విద్యాసంవత్సరంలో చదివే విద్యార్థులకు.. ఇక ముందు వచ్చే విద్యాసంవత్సరంలో కూడా మారిన ఇంగ్లీష్ పేపర్ సిలబస్ ఉంటుందన్నారు. మార్చి 2023 మరియు మే 2022-23 లో నిర్వహించే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ విద్యార్థులకు ఈ సిలబస్ ప్రకారం పరీక్ష పేపర్ ఉంటుందని ప్రకటనలో తెలిపారు.
కరోనా కారంణంగా..
కరోనా చదుకునే పిల్లల జీవితాలను టోటల్ గా మార్చేసింది. విద్యార్థులను కళాశాలలకు దూరం చేసి సాంకేతికత తో ఆన్లైన్ చదువులుగా మార్చేసింది. గత రెండు సంవత్సరాల నుంచి విద్యావ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలలో అయినా.. కాలేజీలో అయినా పూర్తి సిలబస్ ను కంప్లీట్ చేయలేకపోయారు. దీంతో పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే 2021-2022 విద్యాసంవత్సరంలో సిలబస్ ను కుదించి ఎట్టకేలకు పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేశారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తి సిలబస్ ను కంప్లీట్ చేసే విధంగా విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ లో సిలబస్ లో మార్పు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి అయిదేళ్లకు సిలబస్‌ను మార్చాలని గతంలోనే నిర్ణయం జరిగింది. 2019-20 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన హ్యుమనిటీస్ సబ్జెక్టుల సిలబస్‌ను మార్చిన ఇంటర్‌బోర్డు ఈ ఏడాది సెకండియర్ మొదటి లాంగ్వేజ్ సిలబస్‌ను మార్చింది.
ఆఖరు తేదీ పొడిగింపు..
తెలంగాణ ఇంటర్ బోర్డ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల నుంచి వచ్చిన పలు వినతులను పరిశీలించి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్స్ కు సంబంధించిన ఆఖరి తేదీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ అంటే.. శుక్రవారం వరకు సప్లమెంటరీ పరీక్షలకు ఫీజును చెల్లించుకోవచ్చని ఇంటర్ బోర్డ్ తెలిపింది. వివిధ సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో ఫీజు చెల్లించొచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.