తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబధించి హాల్ టికెట్స్ ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. హాల్ టికెట్స్ లో తప్పులు ఉంటే.. సరిచూసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. హాల్ టికెట్స్ పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది ఇంటర్ బోర్డు.
డౌన్‌లోడ్ చేసుకొనే విధానం..
Step 1 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ ను సందర్శించాలి.
Step 2 : అనంతరం TSBIE IPE 2023 Inter Hall Tickets లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3 : తర్వాత https://tsbieht.cgg.gov.in/IPE2023FirstYrHallTickets.do లింక్ ఓపెన్ అవుతుంది. లింక్ ఇంకా యాక్టివేట్ కాలేదు..
Step 4 : అవసరమైన డీటైనల్స్ నమోదు చేసి సబ్‌మిట్ కొట్టాలి
Step 5 : హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోగానే ఏం చేయాలి..
విద్యార్థులు అడ్మిట్ కార్డు (Admit Cards) డౌన్‌లోడ్ చేసుకొని ముందుగా పూర్తిగా వ్యక్తిగత వివరాలు సరిచూసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, పాఠశాల పేరు, సబ్జెక్టుల వివరాలు సరిగా ఉన్నాయో లేదు చూసుకోవాలి. అక్షర దోషాలు ఉంటే గుర్తించాలి. వివరాలు అన్ని సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. లేకుంటే తప్పిదాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లాలి.
పరీక్షల షెడ్యూల్ ఇదే..
మార్చి 15 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు..
మార్చి 15న సెకండ్ ల్యాంగ్వేజ్ పేపర్
మార్చి 17న ఇంగ్లీష్ పేపర్
మార్చి 20న మ్యాథ్స్ పేపర్ 1ఏ / బోటనీ / పొలిటికల్ సైన్స్
మార్చి 23న మ్యాథ్స్ పేపర్ 1బీ/జూవాలజీ / హిస్టరీ
మార్చి 25న పిజిక్స్ / ఎకనామిక్స్
మార్చి 28న కెమిస్ట్రీ / కామర్స్
మార్చి 31 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ (బైపీసీ స్టూడెంట్స్‌కి)
ఏప్రిల్ 03న మోడ్రన్ ల్యాంగ్వేజ్ / జియోగ్రఫీ
ఇంటర్ సెకండియర్ పరీక్షలు మార్చి 16 నంచి..
మార్చి 16న సెకండ్ ల్యాంగ్వేజ్
మార్చి 18న ఇంగ్లీష్
మార్చి 21న మ్యాథ్స్ పేపర్ 2ఏ / బోటనీ / పొలిటికల్ సైన్స్
మార్చి 24న మ్యాథ్స్ పేపర్ 2బీ/జువాలజీ / హిస్టరీ
మార్చి 27న ఫిజిక్స్ / ఎకనామిక్స్
మార్చి 29న కెమిస్ట్రీ / కామర్స్
ఏప్రిల్ 01న పబ్లిక్ అడ్మినిస్టరేషన్ పేపర్ 2 / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ 2 ) బైపీసీ స్టూడెంట్స్
ఏప్రిల్ 04న మోడ్రన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 / జియోగ్రఫీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Inter exams, Intermediate exams, JOBS, Students, Telangana