మార్చి 15 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు మొదలైన విషయం తెలిసిందే. అయితే నేడు ఆంధ్రప్రదేశ్ లో ఫిజిక్స్ 2(ఇంటర్ సెకండ్ ఇయర్) పరీక్ష నిర్వహించారు. దీనిలో ఇంగ్లీష్ మీడియం పేపర్లో తప్పులు దొర్లినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ 2 మార్కులు కలపుతామని ప్రకటించింది. ఫిజిక్స్ పేపర్ 2లోని మూడో ప్రశ్న తప్పుగా ఇచ్చినట్లు గుర్తించింది. దీంతో ఈ ప్రశ్నను విద్యార్థులు అటెమ్ట్ చేసినా.. చేయకపోయినా.. 2 మార్కులు కలుపుతామని వెల్లడించింది. ఈ మేరకు విద్యార్థులెవ్వరూ ఆందోళన చెందవద్దని ఇంటర్ బోర్డు కోరింది.
మార్చి 16 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 25 వరకు, ఏప్రిల్ 30 నుంచి మే 10వరకు నిర్వహించనున్నారు. రోజూ రెండు విడతల్లో ఆదివారం కూడా జరుగుతాయి.
పరీక్షలకు సంబంధించిన సమస్యలపై ఏపీ ఇంటర్ విద్యామండలి టోల్‌ఫ్రీ నంబరు 18004257635 ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏమైనా సందేహాలు ఉంటే ఈ నంబర్ లో సంప్రదించవచ్చు. రాష్ట్రంలో 1,489 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 10,03,990మంది పరీక్షలు రాస్తున్నారు. మొదటి ఏడాది విద్యార్థులు 4,84,197 ఉండగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,19,793 మంది ఉన్నారు. అన్ని కేంద్రాల్లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులను తమ తల్లిదండ్రులు కేంద్రాల వద్ద విడిచిపెడుతున్నారు. ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, AP Inter Exams 2023, Career and Courses, JOBS