ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (CRP SPL-XII) ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక సైట్ ibps.in సందర్శించడం ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. IBPS SO ప్రిలిమ్స్ పరీక్ష 24 డిసెంబర్ నుండి 31 డిసెంబర్ 2022 వరకు దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడింది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాత మెయిన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. IBPS SO మెయిన్స్ పరీక్ష జనవరి 2023 చివరి వారంలో ఉంటుంది.
ఫలితాలను ఇలా చెక్ చేయండి..
Step 1: ముందుగా అభ్యర్థులందరూ IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.inని సందర్శించండి.
Step 2: ఆపై హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న IBPS SO ప్రిలిమ్స్ ఫలితం 2022 లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: తర్వాత అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్ / రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్ / పుట్టిన తేదీని నమోదు చేసి సమర్పించండి.
Step 4: ఇప్పుడు అభ్యర్థి Result స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
Step 5: ఆ తర్వాత అభ్యర్థులు స్కోర్‌ని తనిఖీ చేసి.. పేజీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Step 6: చివరగా.. అభ్యర్థి ఆ పేజీlr ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు.
ఐబీపీఎస్ క్యాలెండర్..
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది వివిధ బ్యాంకుల్లో క్లర్క్, పీవో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఐబీపీఎస్ క్లర్క్స్, ఐబీపీఎస్ పీవో, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పరీక్షలకు సంబంధించిన 2023-24 పరీక్షల క్యాలెండర్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) జనవరి 16న వెల్లడించింది.
రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్, ప్రొబెషనరీ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయనుంది.
గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్(స్కేల్-1), ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆగస్టు 5, 6, 12, 13, 19 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష సెప్టెంబరు 10, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. అదేవిధంగా ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్-2, 3 సింగిల్ పరీక్షను సెప్టెంబరు 10న నిర్వహించనుంది. ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల భర్తీకి ఆగస్టు 26, 27, సెప్టెంబరు 2న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా అక్టోబరు 7న మెయిన్ పరీక్ష ఉండనుంది. ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి డిసెంబరు 30, 31 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష, 2024 జనవరి 28న మెయిన్ పరీక్షలను ఐబీపీఎస్ నిర్వహించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.