మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కోర్సులను (new courses) ప్రవేశపెడుతున్నాయి ప్రతిష్టాత్మక సంస్థలు. తాజాగా ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (Indian Space Research Organization) రెండు ఉచిత కోర్సులను ప్రారంభించింది. ఇస్రో పరిధిలోని డెహ్రాడూన్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (IIRS).. రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (Geographical Information System)పై ఆన్లైన్ కోర్సు (Online course)కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత ఆన్లైన్ కోర్సులు మొత్తం 12 రోజుల్లో పూర్తవుతాయి. ఈ కోర్సులు వ్యవసాయం, నేల, అటవీ (forest), జీవావరణ శాస్త్రం, జియోసైన్స్, భౌగోళిక ప్రమాదాలు, మెరైన్ అట్మాస్పియర్ రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అప్లికేషన్లపై అవగాహన కల్పిస్తాయి. పట్టణాలు, నగరాల్లో నీటి వనరులు ఆవశ్యకతను తెలియజేస్తాయి.
40 శాతం ఉత్తీర్ణత మార్కులు..
ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) చేస్తున్న విద్యార్థులు ఈ కోర్సులకు (Free Online Course) దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కేంద్ర, లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే టెక్నికల్ (Technical) లేదా సైంటిఫిక్ స్టాఫ్, యూనివర్సిటీల పరిధిలోని పరిశోధకులు కూడా పాల్గొనవచ్చు. కోర్సులో భాగంగా కనీసం 70 శాతం హాజరు, 40 శాతం ఉత్తీర్ణత మార్కులు సాధించిన వారికి మాత్రమే ఇస్రో (ISRO) నుంచి పార్టిసిపెంట్ సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ కోర్సును నవంబర్ 8 నుంచి నవంబర్ 26 వరకు నిర్వహిస్తారు. ఈ కోర్సులను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (Indian Space Research Organization) పరిధిలోని అంతరిక్ష విభాగం స్పాన్సర్ చేస్తోంది.
* ఇస్రో ఆన్లైన్ కోర్సులో కవర్ అయ్యే టాపిక్స్ ఏంటి?
సహజ వనరుల నిర్వహణ అభివృద్ధి, పాలనలో రిమోట్ సెన్సింగ్ (Remote sensing), ఇతర జియోస్పేషియల్ టెక్నాలజీల అప్లికేషన్.
పంటలను అంచనా వేయడం, పర్యవేక్షించడం. రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ అప్లికేషన్ GIS Application).
రిమోట్ సెన్సింగ్, జియోలాజికల్ స్టడీస్ (geological studies)తో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్.
రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ల (remote sensing applications) సహాయంతో భూగర్భ అధ్యయనం.
వాతావరణ మార్పుల (Weather changes) అధ్యయనంలో జియోస్పేషియల్ టెక్నాలజీ ఉపయోగం.
* ఇస్రో ఉచిత ఆన్లైన్ కోర్సుకు ఎలా దరఖాస్తు చేయాలి?
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. లెక్చర్ స్లైడ్లు, వీడియో-రికార్డెడ్ లెక్చర్లు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, హాండ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ వంటి పద్దతుల్లో కోర్సు స్టడీ మెటీరియల్ను ఆన్లైన్లో అందుబాటులోకి తెస్తారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.