హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IGNOU Admissions: ఇగ్నో అడ్మిషన్స్.. దరఖాస్తులకు కొన్ని గంటలే సమయం..

IGNOU Admissions: ఇగ్నో అడ్మిషన్స్.. దరఖాస్తులకు కొన్ని గంటలే సమయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ముందుగా జనవరిలోనే ఆఖరి తేదీని నిర్ణయించగా, అంతర్జాతీయ విద్యార్థుల కోసం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ గడువును ఇప్పటికే పలుసార్లు పెంచగా ఇప్పుడు ఫిబ్రవరి 28గా నిర్ణయించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఇగ్నో (IGNOU)కి ప్రత్యేక గుర్తింపు ఉంది. నేరుగా కాలేజీకి వెళ్లలేని వాళ్లకు వందల దూరవిద్యా కోర్సులు అందిస్తోంది. కొన్ని లక్షలమంది ఏటా ఇందులో కొత్త కోర్సులు (New Courses) చేస్తున్నారు. తాజా గణాంకాల ప్రకరాం సుమారు 4.3 మిలియన్‌ స్టూడెంట్స్‌ ఇగ్నోలో ఏదో ఒక కోర్సు అభ్యసిస్తున్నారు. ఇందులో ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL), ఆన్‌లైన్ లెర్నింగ్ (OL) కోర్సులు చేసే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ కోర్సు విద్యార్థుల కోసం ఓ మంచి అవకాశం ఇచ్చింది. ODL, OL కోర్సులకు సంబంధించి జనవరి 2023 అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ గడువును ఫిబ్రవరి 28 దాకా పొడిగించిన విషయం తెలిసిందే. అయితే నేటితో ఈ అడ్మిషన్ల దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది.

ముందుగా జనవరిలోనే ఆఖరి తేదీని నిర్ణయించగా, అంతర్జాతీయ విద్యార్థుల కోసం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ గడువును ఇప్పటికే పలుసార్లు పెంచగా ఇప్పుడు ఫిబ్రవరి 28గా నిర్ణయించింది. అది కూడా నేటితో ముగియనున్నది. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌, ఓపెన్‌ అండ్ డిస్టెన్స్‌ లెర్నింగ్‌కు ఇది మంచి అవకాశం. ODL, OL కోర్సులు చేద్దామనుకునే వారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

దరఖాస్తు విధానం ఇలా..

-ముందుగా IGNOU అధికారిక వెబ్‌సైట్ ignou.ac.inలోకి వెళ్లాలి. లేదా గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లోకి వెళ్లి IGNOU అని సెర్చ్‌ చేసినా మొదటి ఆప్షన్‌లోనే కనిపిస్తుంది.

-ఇగ్నో హోం పేజీ ఓపెన్‌ అవుతుంది. కిందకు స్క్రోల్‌ చేసుకుని వెళ్తే కొన్ని 'Alerts' కనిపిస్తాయి.

-అందులో 'The Last Date of Re-Registration for the January 2023 extended' అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాని మీద క్లిక్‌ చేయగానే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.

-కింద ప్రొసీడ్‌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేసిన తర్వాత లాగిన్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. మీకు ముందే లాగిన్‌ ఐడీ ఉండే దాంతో లాగిన్‌ అవ్వొచ్చు.

-లేదంటే 'New Registration' ఆప్షన్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి. ODL లేదా OLకు సంబంధించిన ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్‌ లింక్‌ కనిపిస్తుంది.

-దాన్ని క్లిక్‌ చేస్తే ఆప్లికేషన్‌ ఫారమ్‌ ఓపెన్‌ అవుతుంది. దాన్ని పూర్తి చేసి ఆలస్య రుసుం రూ.200తో కలిపి ఫీజు చెల్లించాలి. మొత్తం ప్రోసెస్‌ పూర్తయిన తర్వాత ప్రివ్యూ కనిపిస్తుంది.

-సబ్మిట్‌ చేసిన తర్వాత అప్లికేషన్‌ ఫారమ్‌ను డౌన్‌లోడ్‌ చేసి, భద్రపరుచుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగపడుతుంది.

First published:

Tags: Career and Courses, IGNOU, JOBS, NewsIGNOU

ఉత్తమ కథలు