హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Singareni Collieries: సింగరేణి కారుణ్య నియామకాలపై హైకోర్టు సంచలన తీర్పు.. ఇక నుంచి వాళ్లు కూడా అర్హులే..

Singareni Collieries: సింగరేణి కారుణ్య నియామకాలపై హైకోర్టు సంచలన తీర్పు.. ఇక నుంచి వాళ్లు కూడా అర్హులే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Singareni Collieries: బొగ్గు ఉత్పత్తి అంటే మన దేశంలో మొదట గుర్తుకు వచ్చే ప్రదేశం తెలంగాణలోని ఉమ్మడి నాలుగు జిల్లాలో(ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్) నెలకొన్న సింగరేణి కాలరీస్. ఈ సంస్థలో ఉద్యోగం దొరకడం అంటే అది ఒక వరమే అని చెప్పాలి.

ఇంకా చదవండి ...

బొగ్గు ఉత్పత్తి(Coal Production) అంటే మన దేశంలో మొదట గుర్తుకు వచ్చే ప్రదేశం తెలంగాణలోని ఉమ్మడి నాలుగు జిల్లాలో(ఖమ్మం(Khammam), వరంగల్(Warangal), కరీంనగర్(Karimnagar), ఆదిలాబాద్(Adilabad)) నెలకొన్న సింగరేణి కాలరీస్(Singareni Collieries). ఈ సంస్థలో ఉద్యోగం(Job) దొరకడం అంటే అది ఒక వరమే అని చెప్పాలి. అయితే దీనిలో పని చేసే ఉద్యోగులు(Employees) వివిధ కారణాల వల్ల మరణించినా.. ఉద్యోగ విరమణ పొందినా వాళ్ల వారసులకు ఈ పోస్టులకు కేటాయిస్తారు. వీటినే కారుణ్య నియామకాలు అంటారు. దీనిలో భాగంగానే ఇటీవల కారుణ్య నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సింగరేణి అధికారులు తెలిపారు. మార్చి, 2022 నాటికి 12వేల మందికి పైగా వారసులకు ఉద్యోగాలు కల్పించామన్నారు.

Textile Recruitment 2022: 10వ తరగతి అర్హతతో.. టెక్స్‌టైల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్, అటెండెంట్ పోస్టుల భర్తీ..


అయితే హైకోర్టు(High Court) ఈ నియామకాలకు సంబంధించి సంచలన తీర్పును వెలువరించింది. సింగరేణి కాలరీస్‌లో కారుణ్య నియామకం కింద అవివాహిత సోదరి కూడా అర్హురాలేనని స్పష్టం చేసింది. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశం లభిస్తుంది. దీంతో కొడుకో, కూతురో ఉద్యోగంలో చేరితే ఆ కుటుంబానికి ఆసరా దొరుకుతుంది. ఈ హైకోర్టు తీర్పుతో సోదరికి(అక్క లేదా చెల్లి) కూడా అవకాశం ఉన్నట్లు స్పష్టం అయింది. గోదావరిఖనికి చెందిన శ్రీవాణి సోదరుడు సింగరేణిలో ఉద్యోగి. అతడికి పెళ్లి కాలేదు. అతడు కొంతకాలం క్రితం చినిపోయాడు.

సోదరుడి ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద తనకు ఇవ్వాలని శ్రీవాణి సింగరేణి అధికారులకు దరఖాస్తు చేసుకొన్నారు. ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబసభ్యుల(డిపెండెంట్) నిర్వచనం కిందకు సోదరి రాదని.. ఉద్యోగం ఇవ్వలేమని ఆమె దరఖాస్తును పెద్దపల్లి జిల్లా గోదావరిఖని-1 ఇంక్లెయిన్‌ తిరస్కరించింది. దీనిపై శ్రీ వాణి హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్‌పై జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

వాదనలు విన్న ధర్మాసనం శ్రీవాణికి అనుకూలంగా తీర్పునిచ్చింది. పిటిషనర్‌ కూడా తగిన పోస్టుకు అర్హురాలేనని న్యాయమూర్తి జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. పిటిషనర్‌కు నాలుగు వారాల్లోగా తగిన ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది. గతంలో జార్ఖండ్‌ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించింన సందర్భాన్ని గుర్తుచేశారు.

SAI Recruitment 2022: పది అర్హతతో.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..


ఉద్యోగాల కల్పనలో ముందు..

ఉద్యోగాలు కల్పించడంలో కూడా సింగరేణి ముందుంటుంది. ఇటీవల ఇంటర్నల్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. ఎక్స్ టర్నల్ నోటిఫికేషన్ 20th జూన్ 2022 వెల్లడించారు. దీనిలో మొత్తం 177 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు జులై 10 వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటికి సెప్టెంబర్ 4, 2022 న పరీక్షను నిర్వహించనున్నట్లు వెబ్ సైట్ లో పేర్కొన్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Singareni, Singareni Collieries Company

ఉత్తమ కథలు