హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Junior Lecturer: అభ్యర్థులకు అలర్ట్.. JL పరీక్షపై హైకోర్టు కీలక ఆదేశాలు..

Junior Lecturer: అభ్యర్థులకు అలర్ట్.. JL పరీక్షపై హైకోర్టు కీలక ఆదేశాలు..

తెలంగాణ హైకోర్టు (ఫైల్ ఫోటో)

తెలంగాణ హైకోర్టు (ఫైల్ ఫోటో)

జూనియర్ లెక్చరర్ నియామక పరీక్ష రెండో పేపర్ ను తెలుగులో ఇవ్వాలని కొంత మంది అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

జూనియర్ లెక్చరర్ నియామక పరీక్ష రెండో పేపర్ ను తెలుగులో ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. టీఎస్పీఎస్సీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో జేఎల్ పేపర్ 2ని ఇంగ్లీష్ లోనే ఇవ్వాలని నిర్ణయించింది. కానీ దీనిపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలుగులో పీజీ చదువుకున్న అభ్యర్థులు  నష్టపోతున్నామని వారు  టీఎస్పీఎస్సీకి విన్నవించుకన్నా ఫలితం లేకుండా పోయింది.  దీంతో అభ్యర్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తర్వాత ఈ అంశం కాస్త హైకోర్టు మెట్లు ఎక్కడంతో.. తాజాగా దీనిపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. జేఎల్ ప్రశ్నాపత్రం పేపర్ 1 తెలుగు -ఇంగ్లీష్ లో ఇస్తున్నట్లుగానే.. పేపర్ 2 కూడా రెండు భాషల్లో ఇవ్వాలని ఆదేశించింది.

పరీక్షవిధానం ఇలా..

మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో ఉంటుంది. పేపర్-2  కూడా తెలుగు ఇంగ్లిష్‌లో ఉండనుంది.

ఇటీవల టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్(JL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జేఎల్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వెలువడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో నోటిఫికేషన్‌ జారీ చేశారు. తర్వత అనేక కారణాల వల్ల ఈ పోస్టులను2012లో భర్తీ చేశారు. తెలంగాణ ప్రాంతంలో సుమారు 457 జేఎల్‌ పోస్టులను భర్తీ చేయగలిగారు. ఆ తర్వాత మళ్లీ జేఎల్‌ పోస్టుల భర్తీ జరగలేదు. అంటే దాదాపు 10 ఏళ్ల వరకు ఎలాంటి పోస్టులను భర్తీ చేయలేదు. 10 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి.. ఈ పోస్టులకు మొత్తం 90 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.  27 సబ్జెక్టుల్లో.. మల్టీ జోన్ 1 లో 724, మల్టీ జోన్ 2 లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Students: ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచే రిజిస్ట్రేషన్స్ ప్రారంభం..

దీనికి సంబంధించి పరీక్షను జూన్ లేదా జులై 2023లో నిర్వహించనున్నట్టు ప్రకటించగా.. తాజా పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఈ పరీక్ష తేదీలో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ  ప్రకటించాల్సి ఉంది.

First published:

Tags: JOBS, Telangana, Telangana jobs, TSPSC

ఉత్తమ కథలు