హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Singareni Junior Assistant: సింగరేణి అభ్యర్థులకు గుడ్ న్యూస్.. కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. 

Singareni Junior Assistant: సింగరేణి అభ్యర్థులకు గుడ్ న్యూస్.. కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. 

Singareni Junior Assistant: సింగరేణి అభ్యర్థులకు గుడ్ న్యూస్.. కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. 

Singareni Junior Assistant: సింగరేణి అభ్యర్థులకు గుడ్ న్యూస్.. కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. 

Singareni Junior Assistant: సింగరేణి జూనియిర్ అసిస్టెంట్ పరీక్ష రాసే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ నియామకం అంతా పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అంతే కాకుండా.. 

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(Singareni Collieries Company Limited) 177 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 20th జూన్ 2022న రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్(Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్లరికల్‌ జాబ్‌ నాన్‌ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లోకి(Clerical Cadre Non Executive Cadre)వస్తుంది. జూన్ 20 నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు మొదలవ్వగా.. జులై 10 వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు స్వీకరణ ముగిసింది. ఇక దీనికి సంబంధించి హాల్ టికెట్స్ ను ఆగస్టు 28 ఉదయం 11 గంటను నుంచి వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://scclmines.com/scclnew/index.aspవెబ్ సైట్ లో  అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాలని సంస్థ తెలిపింది. ఈ పరీక్ష సెప్టెంబర్ 4, 2022 న నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. ఒకే షిప్ట్ లో పరీక్షను నిర్వహించనున్నారు.

Telangana Government: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. 1654 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..


పరీక్షలో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని, అలాగే హాల్ టికెట్లో ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని సంస్థ తెలిపింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినందున తెలంగాణలోని 8 జిల్లాల్లో 187 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు డైరెక్టర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్ 1, 2, కరీంనగర్ , వరంగల్, ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం , మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణకు ప్రతీ రీజియన్ కు ఒక్కో ఒక్కో చీఫ్ కో ఆర్డినేటర్ ను నియమించామని, ప్రతీ కేంద్రానికి పర్యవేక్షకులు ఉంటారని తెలిపారు.

హైదరాబాద్ - 1లో మొత్తం 19 సెంటర్లలో.. హైదరాబాద్ - 2 లో   14 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. అంతే కాకుండా.. కరీంనగర్ కేంద్రంలో మొత్తం 39,  ఖమ్మంలో 23, వరంగల్లో 18, మంచిర్యాలలో 28, ఆదిలాబాద్ లో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 35 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్ం 187 పరీక్ష సెంటర్లను కేటాయించినట్లు డైరెక్టర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ తెలిపారు.

ఇదిలా ఉండగా.. సింగరేణి జూనియిర్ అసిస్టెంట్ పరీక్ష రాసే అభ్యర్థులకు హైకోర్టు శుభవార్త చెప్పింది. 2015లో నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ప్రశ్నాపత్రంగానీ.. హాల్ టికెట్ కానీ.. కార్బన్ ఓఎమ్ ఆర్ కానీ ఇవ్వలేదు. దీంతో ఈ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలను అప్పడు అధికారులు తిప్పికొట్టారు.

Telangana Group 2-Group 3 Posts: గ్రూప్ 3, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. వివరాలిలా..


అలాంటి సందర్భం ఇప్పుడు రావద్దనే ఉద్దేశ్యంతో  ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం అభ్యర్థులకు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని ఓ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఈ పరీక్ష రాసే ప్రతీ అభ్యర్థికి ప్రశ్నాపత్రం, హాల్ టికెట్ ఇంటికి తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని బోర్డుకు హైకోర్టు ఆదేశించింది. సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీ కోసం సెప్టెంబర్ 4న పరీక్ష ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా పరీక్ష జరిగిన వారం రోజుల్లోకి ప్రాథమిక కీ ని విడుదల చేయాలని సింగరేణి సంస్థకు కోర్టు స్పష్టం చేసింది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Singareni, Singareni Collieries Company

ఉత్తమ కథలు