NEET PG 2023 పరీక్ష తేదీలకు సంబంధించి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అభ్యర్థులను అప్రమత్తం చేసింది. సోషల్ మీడియాలో వైరల్(Viral0 అవుతున్న నోటీసు(Notice) నకిలీదని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. NEET PG 2023 పరీక్షకు సంబంధించిన అధికారిక తేదీని NBE ఇప్పటికే ప్రకటించింది. సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్న నోటీసులో, పరీక్ష తేదీలలో మార్పు గురించి చర్చ జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన నోటీసు ప్రకారం.. నీట్ పీజీ పరీక్ష 21 మే 2023న నిర్వహించబడుతుంది. దీని కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 7 నుండి మార్చి 25, 2023 వరకు సమర్పించవచ్చు. అభ్యర్థులు మార్చి 29 నుండి ఏప్రిల్ 7, 2023 వరకు దరఖాస్తు ఫారమ్‌ను(Application Form) సవరించగలరు. అంతే కాకుండా.. అడ్మిట్ కార్డ్ జారీ తేదీ కూడా నోటీసులో రాయబడింది. ఇది మే 16, 2023 నోటీసు ప్రకారం పేర్కొన్నారు. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 20 నాటికి ప్రకటించబడతాయని ఆ ఫేక్ నోటీస్ లో(Fake Notice) పేర్కొన్నారు.
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ నకిలీ నోటీసును ట్వీట్ చేయడం ద్వారా షేర్ చేసింది. NEET-PG 2023 పరీక్షను రీషెడ్యూల్ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతోంది. ఇది అంతా ఫేక్ అని.. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను ఇతరులతో షేర్ చేయవద్దని పేర్కొంది. ఇవన్ని అవాస్తవాలు అని స్పష్టం చేసింది. ఇంలాంటి ఫేక్ మెసేజ్ లతో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
#FakeNews This message is circulating on some social media platforms regarding rescheduling of NEET-PG 2023 examination. The message is #FAKE. Be careful. Do not share such FAKE messages with others. pic.twitter.com/Ooey2SvESL
— Ministry of Health (@MoHFW_INDIA) February 7, 2023
ఇదిలా ఉండగా.. NBE(నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్) జారీ చేసిన అసలు నోటిఫికేషన్ ప్రకారం.. NEET PG 2023 పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌లు ఫిబ్రవరి 27న జారీ చేయబడతాయని.. NEET PG పరీక్ష మార్చి 5న నిర్వహించబడుతుందని తెలిపారు. NEET PG 2023కి సంబంధించిన ఏవైనా అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు అధికారిక సైట్‌ను తనిఖీ చేస్తూ ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎలాంటి నోటీసులను చూసి అభ్యర్థులు మోసపోద్దని హెచ్చిరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Fake jobs, JOBS, Neet pg