NEET పీజీ అభ్యర్థులు, FAIMA ప్రతినిధి బృందంతో కలిసి ఈరోజు న్యూఢిల్లీలోని(New Delhi) జంతర్ మంతర్ వద్ద పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జారీ చేసిన క్యాలెండర్ ప్రకారం.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) 2023 మార్చి 5న నిర్వహించబడుతుంది. మెడికల్ ప్రవేశ పరీక్షను మే లేదా జూన్‌కు వాయిదా వేయాలని అభ్యర్థులు అధికారులను కోరుతున్నారు. తాజాగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ NEET PG 2023ని రీషెడ్యూల్ చేసింది. ఇంటర్న్‌షిప్ ఆలస్యం కారణంగా అర్హత పొందని అభ్యర్థులను అనుమతించే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆలస్యమైన ఇంటర్న్‌షిప్ కారణంగా NEET PG 2023 పరీక్షకు అర్హత పొందని 5 రాష్ట్రాలు/UTలలోని 13,000 కంటే ఎక్కువ MBBS విద్యార్థుల భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని.. MoHFW అర్హత కోసం ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడానికి చివరి తేదీని 11 ఆగస్టు 2023 వరకు పొడిగించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
Considering the future of more than 13,000 MBBS students across 5 States/UTs who were not eligible for #NEET PG 2023 exam due to delayed internship, MoHFW has decided to extend last date of completion of internship for eligibility to 11th Aug 2023. — Ministry of Health (@MoHFW_INDIA) February 7, 2023
మార్చి 5న నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తే దాదాపు 13 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయడానికి అర్హులు కాకపోవడంతో వారు దూరమవుతారని అభ్యర్థులు పేర్కొన్నారు. అంతేకాకుండా.. పరీక్షను వాయిదా వేయడం వల్ల అభ్యర్థులు పరీక్షకు సిద్ధం కావడానికి తగినంత సమయం లభిస్తుందని వైద్యుల సంఘం పేర్కొంది. నీట్ పరీక్ష మరియు కౌన్సెలింగ్ ప్రక్రియ మధ్య అంతరాన్ని అధికారులు తొలగించాలని అభ్యర్థులు కోరారు.
NEET PG 2023 వాయిదా వేయడమే కాకుండా.. చాలా మంది ఇంటర్న్‌లు అనర్హులుగా ఉన్నందున ఇంటర్న్‌షిప్ గడువును సవరించాలని వైద్యులు డిమాండ్ చేయడంతో.. ఎట్టకేలకు దీనిని రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొత్త తేదీలను ఇంకా ప్రకటించలేదు.
దీంతో పాటు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక వివరణను జారీ చేసింది. NEET-PG 2023 పరీక్షను రీషెడ్యూల్ చేయడం గురించి కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం అవుతున్న సందేశం నకిలీదని తెలిపింది. నకిలీ నోటిఫికేషన్ స్క్రీన్‌షాట్‌తో.. ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఫేక్ నోటీస్ అంటూ క్లారిటీ ఇచ్చిది. ఇటువంటి వాటిని అభ్యర్థులు నమ్మోద్దని.. ఏ విషయమైన అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవాలని సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.